ప్రతిక్షణం నా కోసం నిలబడ్డాడు.. భర్త పై ఇలియానా ఎమోషనల్ కామెంట్స్?

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ఇలియానా( Ileana ) ఒకరు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయినటువంటి ఈమె రహస్యంగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు అంతేకాకుండా ఓ బిడ్డకు తల్లిగా ప్రమోట్ అయ్యారు.

ఇలా బాబుకు జన్మనిచ్చినటువంటి ఇలియానా ప్రెగ్నెన్సీ( Ileana Pregnancy ) సమయంలో తనకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడించారు .కానీ తన భర్త గురించి( Ileana Husband ) మాత్రం ఎక్కడా చెప్పకపోవడంతో బహుశా ఈమె పెళ్లి కాకుండానే తల్లి అయిందేమో అంటూ చాలామంది ఈమె పట్ల విమర్శలు చేశారు.ఇక తనకు ముందుగానే పెళ్లి జరిగింది అంటూ చివరికి తన భర్త ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇలియానా తన భర్త గురించి అలాగే పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ప్రస్తుతం నా వైవాహిక జీవితం చాలా అందంగా కొనసాగుతుందని తెలిపారు.నా భర్తను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటలలో చెప్పలేనని తెలిపారు.నా కష్ట సమయాల్లో.

నా ఆనంద క్షణాల్లో ఎప్పుడూ నాకు తోడు ఉన్నాడు.మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి క్షణం నాకోసం నిలబడ్డాడు.

అతడు ప్రేమ అంతులేనిది.ప్రతిరోజూ అతడు నాతోనే ఉంటాడనీ తన భర్త గురించి ఈ సందర్భంగా ఇలియానా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో తన భర్త గురించి అలాగే కుటుంబం గురించి చాలామంది విమర్శలు చేశారని అలాంటి విమర్శలు రావడంతో తాను తట్టుకోలేకపోయానని ఈ సందర్భంగా ఇలియానా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు