మీ జాతకం బలహీనంగా ఉంటే.. గురువారం రోజు ఈ పరిహారాలు చేయండి..!

మీ జాతకం బలపడాలంటే గురువారం( Thursday ) రోజు ఈ పరిహారాలు కచ్చితంగా చేయాలి.ఆ పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం రోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి ( Lord Surya )అర్ఘ్యం సమర్పించాలి.ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో ఉన్న విష్ణువును పూజించాలి.

నెయ్యితో దీపం వెలిగించాలి.కాలవ ఒత్తితో ఈ దీపాన్ని వెలిగించి అందులో కాస్త కుంకుమ వేయాలి.

ఇలా చేయడం వల్ల నారాయణుడు సంతోషించే మీపై కరుణ చూపుతాడు.అలాగే గురువారం రోజున విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం( Vishnu Chalisa, Vishnu Sahasranamam ) పాటించాలి.

Advertisement

దానివల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ మహా విష్ణు ఆశీర్వాదం లభిస్తుంది.జీవితంలో పురోగతి సాధిస్తారు.

గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసి ఆచారాల ప్రకారం విష్ణువును పూజించాలి.ఆ తర్వాత విష్ణు కథ చదవాలి.

అలాగే కుశ ఆసనం పై కూర్చుని మాత్రమే విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం చదవడం ఎంతో మంచిది.శ్రీమహావిష్ణువుకు ( Lord Vishnu )పసుపు అంటే ఎంత ఇష్టం.విష్ణు సహస్రనామం చదివిన తర్వాత దేవునికి కొన్ని పసుపు రంగులో ఉన్న పదార్థాలను, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి.

గురువారం రోజు అవసరమైన వారికి దానం చేయాలి.ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడి మీపై విష్ణు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

How Modern Technology Shapes The IGaming Experience
చిన్న పిల్లలు తెలిసి తెలియక ఇలా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త..?

ఇంకా చెప్పాలంటే గురువారం రోజు కుంకుమతో పూజలు చేయడం ద్వారా జాతకంలో గ్రహ పరిస్థితి మెరుగుపడుతుంది.

Advertisement

ఈ రోజు రాత్రి పడుకునే ముందు పాలలో కుంకుమపువ్వును ( Saffron )కలిపి తాగాలి.పాలు,కుంకుమ పువ్వుతో ఖీర్ చేసి ముందుగా విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి.ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా ఆరగించాలి.

ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి.గురువారం రోజున మీకు సంబంధించి సన్నిహితమైన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే వారిని కలిసి ఏమైనా దానంగా కానీ, బహుమతి కానీ ఇవ్వాలి.

అలాగే ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు.

తాజా వార్తలు