గురువారం రోజు సాయిబాబాను ఇలా పూజిస్తే.. బాబా అనుగ్రహం మీ సొంతం..!

మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్లి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.

అలాగే గురువారం రోజు సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

అందుకే సాయిబాబాను విశ్వసించేవారు ఆయనను పూజించడమే కాకుండా ఆయన అనుగ్రహం పొందేందుకు ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు.సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ఎవరైనా షిరిడి సాయిబాబాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తే సాయిబాబా( Sai Baba ) తమ జీవితంలో ఆనందాన్ని నింపుతాడని ప్రజలు నమ్ముతారు.అలాగే గురువారం రోజున చేసే పూజా విధానం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శిరిడి సాయిబాబా మహిమ ఆపరిమితమైనదని చాలామంది భక్తులకు తెలుసు.ఆయన ఎప్పుడూ కులం, మతం, జీవుల మధ్య వివక్షతను చూపలేదు.

Advertisement
If You Worship Sai Baba Like This OnThursday .. Baba's Grace Is Your , Sai Baba

ఎవరైతే భక్తితో సాయిబాబా అని పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని ప్రజలు చెబుతూ ఉంటారు.అంతేకాకుండా గురువారం రోజు ఉపవాసం ఉండడం వల్ల సాయిబాబా ప్రత్యేక అనుగ్రహం భక్తుల( Devotees )పై ఎప్పుడూ ఉంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ముఖ్యంగా చెప్పాలంటే సాయిబాబా ఎప్పుడు కూడా సబ్ కా మాలిక్ ఏక్ హై అనే సందేశాన్ని ఇచ్చేవారు.

If You Worship Sai Baba Like This Onthursday .. Babas Grace Is Your , Sai Baba

ముఖ్యంగా చెప్పాలంటే సాయిబాబాను పూజించాలంటే ముందుగా గురువారం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగా స్నానం చేయాలి.స్నానం చేసిన తర్వాత సాయిబాబాను ధ్యానించాలి.అలాగే గురువారం రోజు ఉపవాస దీక్షను చేపట్టాలి.

శరీరం మనసు స్వచ్ఛంగా ఉండేలా చూసుకొని సాయిబాబా విగ్రహం ప్రతిష్టించి దానిపై గంగాజలం చల్లాలి.విగ్రహం పై పసుపు రంగు వస్త్రాన్ని కచ్చితంగా ఉంచాలి.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రతి రోజు గుప్పెడు అవిసె గింజలను తింటే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు

సాయిబాబా విగ్రహానికి కుంకుమ, పూలు, అక్షతలు కూడా సమర్పించాలి.పళ్లెంలో అగరవత్తులు, నెయ్యి వేసి సాయిబాబాకు హారతిని ఇవ్వాలి.

Advertisement

ఆ తర్వాత అక్షత, పసుపు పువ్వులను( Yellow flowers ) చేతిలోకి తీసుకొని బాబా కథను వినాలి.

సాయిబాబా పూజకు పసుపు రంగు శుభప్రదంగా పరిగణిస్తారు.అందుకే బాబాకు పసుపు మిఠాయిలను మాత్రమే సమర్పించాలి.పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన మిఠాయిలు ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి.

మీరు దానం చేయగలిగితే మీ సామర్థ్యం మేరకు పేదవారికి దానం చేయడం ఎంతో మంచిది.

తాజా వార్తలు