కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ వాడాలంటే జస్ట్ ఇలా చేస్తే చాలు..!

కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్( Laptop ) లపై పని చేస్తున్నవారికి మాటి మాటికి మొబైల్ ఫోన్( Mobile phone ) తెరవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

అయితే టెక్నాలజీ అనేది ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త మార్పులను తీసుకు వస్తూ వినియోగదారుల పనులను సులభతరం చేస్తోంది.

కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ ఫోన్ వాడాలంటే ఎస్‌సీఆర్‌సీపీవై( SCRCPY ) అనే సాప్ట్ వేర్ ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుని, యూఎస్బీ ద్వారా కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ ఫోన్ వాడుకోవచ్చు.

కంప్యూటర్ లో ఎస్‌సీఆర్‌సీపీవై డౌన్లోడ్ అని టైప్ చేస్తే గిట్ హబ్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది.అందులో మీ ఓఎస్ వెర్షన్ బట్టి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మొబైల్లో ఎయిర్ డ్రాయిడ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని, సెక్షన్ లో సెక్యూరిటీ అండ్ రిమోట్ ఫీచర్లోకి వెళితే అక్కడ స్క్రీన్ మిర్రర్ ఫీచర్ కనపడుతుంది.దానిని ఎనేబుల్ చేసుకోవాలి.

మొబైల్ ఫోన్ లో యూఎస్బి డిబగింగ్ మోడ్ ఎనేబుల్ చేయాలి.తరువాత యూఎస్బి కేబుల్ తో పీసీని, మొబైల్ ఫోన్ ను కనెక్ట్ చేయాలి.

Advertisement

ఇక కంప్యూటర్లో ఎస్‌సీఆర్‌సీపీవై యాప్ ను రన్ చేస్తే, కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ స్క్రీన్ తెరవబడుతుంది.

ఇక మొబైల్ ఫోన్ ను కంప్యూటర్ మౌస్ నుండి ఆపరేట్ చేయొచ్చు.ఎయిర్ డ్రాయిడ్ వెబ్ ద్వారా వైర్ లెస్ గా కంప్యూటర్ కు, మొబైల్ ఫోను ను కనెక్ట్ చేయవచ్చు.అంతేకాకుండా ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్, బ్యాకప్స్, రిమోట్ టెక్సిటింగ్, కాంటాక్ట్ కాపీ లాంటి ఎన్నో ఫీచర్లను సులభంగా వినియోగించుకోవచ్చు.

ఇక కంప్యూటర్ పై పని చేసేవారు ఎటువంటి ఇబ్బంది పడకుండా కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ ఫోన్ ను సులభంగా వాడుకోవచ్చు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు