ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..

ఫ్యాటీ లివర్ వ్యాధి కారణంగా కాలయంలో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది.కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇది అధికంగా మద్యం సేవించడం వల్ల, అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల కూడా పెరగవచ్చు.కొవ్వు కాలేయ వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా కష్టం.

కానీ మీరు చాలా కాలంగా అలసట, బరువు తగ్గడంతో పాటు పొత్తికడుపు నొప్పి సమస్యలను ఎదుర్కొన్నట్లయితే కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.ఫ్యాటీ లివర్ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మధుమేహం, గుండె పోటు, స్ట్రోక్ మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచుతుంది.

కాబట్టి మీరు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు ఈ వ్యాధి నుంచి బయటపడడానికి కొన్ని పద్ధతులను పాటించడం మంచిది.నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్న 80 మంది రోగుల పై అధ్యయనం చేశామని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement
If You Want To Get Rid Of Fatty Liver Problem.. Just Follow These Tips , Fatty

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోజు వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి.

If You Want To Get Rid Of Fatty Liver Problem.. Just Follow These Tips , Fatty

అంతే కాకుండా కొవ్వు కాలేయ సమస్యను దూరం చేసుకోవడానికి ముందుగా మీరు దాని ప్రమాద కరకాల గురించి తెలుసుకోవాలి.ఊబకాయం, స్లీప్ అప్నియా, అధిక ట్రైగ్లిజరైడ్స్, హైపోథైరాయిడిజం, మధుమేహం కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల కాలయంలో కొవ్వు పెరిగిపోవడం మొదలవుతుంది.

If You Want To Get Rid Of Fatty Liver Problem.. Just Follow These Tips , Fatty

కొవ్వు కాలేయ సమస్యలు నివారించడానికి మీరు ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఎంతో ముఖ్యం.దీనితో పాటు కొవ్వు కాలేయం ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.దాని తర్వాత ఈ సమస్యకు మెరుగైన చికిత్సను చేయించుకోవాలి.

బరువు తగ్గడం వల్ల కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం, మంట, ఫైబ్రోసిస్ తగ్గుతాయి.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు