స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీసొంతం కావాలంటే ఈ స్క్ర‌బ్ ట్రై చేయండి!

చ‌ర్మం స్మూత్‌గా మ‌రియు గ్లోయింగ్‌గా మెరిసిపోవాల‌ని అంద‌రూ కోరుకుంటారు.

కానీ, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, మారిన జీవ‌న‌శైలి, ర‌సాయ‌నాల‌తో నిండి ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం వ‌ల్ల ర‌క‌ర‌కాల చ‌ర్మం స్మూత్‌నెస్ ను కోల్పోయి కాంతిహీనంగా మారుతుంది.

పైగా వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు సైతం తీవ్రంగా మ‌ద‌న పెడుతుంటాయి.అయితే ఆయా స‌మ‌స్య‌ల‌న్నిటికీ చెక్ పెట్టి చ‌ర్మాన్ని స్మూత్ అండ్ గ్లోయింగ్‌గా మార్చ‌డానికి ఇప్పుడు చెప్ప‌బోయే స్క్ర‌బ్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తుంది.

మ‌రి ఈ స్క్ర‌బ్ ఏంటో.దానిని ఎలా త‌యారు చేసుకోవాలో.

ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ప‌ది నుంచి ప‌దిహేను బాదం ప‌ప్పుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా ఒక‌టి లేదా రెండు సార్లు క‌డ‌గాలి.

Advertisement
If You Want Smooth And Glowing Skin, Try This Scrub! Smooth Skin, Glowing Skin,

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో క‌డిగి పెట్టుకున్న బాదం ప‌ప్పులు, హాప్ గ్లాస్ వాట‌ర్ పోసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి జ్యూస్ ను స‌ప‌రేట్ చేసి ప‌క్క‌న పెట్టేసుకుని బాదం ప‌ల్ప్‌ను మాత్రం ఒక బౌల్‌లోకి వేసుకోవాలి.

If You Want Smooth And Glowing Skin, Try This Scrub Smooth Skin, Glowing Skin,

ఈ బాదం ప‌ల్ప్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ వైట్ షుగ‌ర్ పౌడ‌ర్‌, మూడు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే స్క్ర‌బ్బింగ్ మిశ్ర‌మం సిద్ధం అవుతుంది.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు కావాలి అనుకుంటే చేతుల‌కు కూడా అప్లై చేసుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్మూత్‌గా స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను లేదా సీర‌మ్‌ను రాసుకోవాలి.

ఈ స్క్ర‌బ్‌ను నాలుగు రోజుల‌కు ఒక‌సారి ట్రై చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోయి చ‌ర్మం స్మూత్ అండ్ గ్లోయింగ్‌గా మారుతుంది.స్కిన్‌పై ఏమైనా ముదురు రంగు మ‌చ్చ‌లు ఉన్నా తగ్గుతాయి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు