వారం రోజులు ఈ ఆయిల్ ను వాడితే చుండ్రుకు ఈజీగా బై బై చెప్పవచ్చు!

చుండ్రు అంటే చాలా మంది చిన్న సమస్యగా భావిస్తారు.కానీ చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికే అసలైన కష్టం.

చుండ్రు కారణంగా జుట్టు అధికంగా రాలడం, తరచూ డ్రై గా మారడం వంటివి జరుగుతాయి.అలాగే చుండ్రు వల్ల దురద, తీవ్రమైన అసౌకర్యం తదితర సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అందుకే చుండ్రును వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్‌ ఆయిల్ ను వారం రోజుల పాటు వరుసగా వాడితే చుండ్రు సమస్యకు ఈజీగా బై బై చెప్పవచ్చు.

If You Use This Oil For A Week, You Can Easily Say Bye To Dandruff Dandruff, Da

మరి ఇంకెందుకు ఆలస్యం చుండ్రును తరిమికొట్టే ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా స్ట‌వ్‌ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవ నూనె వేసుకోవాలి.నూనె కాస్త హిట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కంలోజి సీడ్స్‌, నాలుగు రెబ్బ‌ల క‌రివేపాకు, నాలుగు తుంచిన‌ మందారం ఆకులు, అర కప్పు ఉల్లి ముక్కలు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

If You Use This Oil For A Week, You Can Easily Say Bye To Dandruff Dandruff, Da
Advertisement
If You Use This Oil For A Week, You Can Easily Say Bye To Dandruff! Dandruff, Da

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్‌ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

వారం రోజుల పాటు వరుసగా ఈ ఆయిల్ ను తలకు రాసుకోవాలి.వారంలో రెండు సార్లు తలస్నానం చేయాలి.

ఇలా కనుక చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా దూరం అవుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

కుదుళ్లు బలంగా మరియు ఆరోగ్యంగా సైతం మారతాయి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు