ఈ హెర్బ‌ల్ ఆయిల్‌ను వాడితే ఆ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్ అవ్వ‌డం ఖాయం!

హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్‌, స్ప్లిట్ ఎండ్స్‌, డ్యాండ్ర‌ఫ్‌, డ్రై హెయిర్‌.

అత్య‌ధికంగా వేధించే జుట్టు స‌మ‌స్య‌ల్లో ఇవే ముందు వ‌ర‌సలో ఉంటాయి అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

వీటిని నివారించుకోవ‌డం కోసం ప‌డే పాటు అన్నీ ఇన్నీ కావు.ఖ‌రీదైన షాంపూలు, నూనెలు వాడుతుంటారు.

తోచిన హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.అయినా స‌రే స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే హెర్బ‌ల్ ఆయిల్‌ను వాడితే ఆయా జుట్టు స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే దూరం అవుతాయి.మ‌రి ఆ హెర్బ‌ల్ ఆయిల్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.

Advertisement

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని అర లీట‌ర్ కొబ్బ‌రి నూనెను పోయాలి.నూనె కాస్త హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆవ పిండి, నాలుగు ల‌వంగాలు, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ తురుము, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తురుము వేసి గ‌రిటెతో తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ త‌ర్వాత అందులో రెండు తుంచిన మందారం ఆకులు, కొన్ని గోరింటాకు ఆకులు, రెండు రెబ్బ‌ల క‌రివేపాకు, ఒక తుంచిన మందారం పువ్వు, ప‌ది తుంచిన తుల‌సి ఆకులు వేసి గ‌రిటెతో తిప్పుకుంటూ చిన్న మంట‌పై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి నూనెను పూర్తిగా కూల్ అయ్యాక‌.ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో స‌ప‌రేట్ చేసుకుంటే హెర్బ‌ల్ ఆయిల్ సిద్ధం అయిన‌ట్లే.

ఈ ఆయిల్‌ను ఒక బాటిల్‌లో నింపుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.ఈ హెర్బ‌ల్ ఆయిల్‌ను రాత్రి నిద్ర‌పోయే ముందుకు త‌ల‌కు మ‌రియు జుట్టు మొత్తానికి ప‌ట్టించి మ‌సాజ్ చేసుకోవాలి.

ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్‌, స్ప్లిట్ ఎండ్స్‌, డ్యాండ్ర‌ఫ్‌, డ్రై హెయిర్ వంటి జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్ అవ్వ‌డం ఖాయం.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement