అందాన్ని రెట్టింపు చేసే అవకాడో.. ఇలా వాడితే 60 లోనూ యవ్వనంగా మెరిసిపోతారు!

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో అవకాడో ఒకటి.ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు అవకాడోలో నిండి ఉంటాయి.

అలాగే మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే అందాన్ని రెట్టింపు చేయడంలోనూ అవకాడో మ‌న‌కు సహాయపడుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా అవకాడో పండును వాడితే ఇర‌వైలోనూ యవ్వనంగా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు అవకాడో పండును ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు బాగా పండిన ఒక అవకాడో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో అవకాడో పల్ప్, మూడు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో స్మూత్ క్రీం ను సపరేట్ చేసుకోవాలి.

ఈ క్రీం లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్‌ సహాయంతో కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని.

ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

మూడు రోజులకు ఒకసారి ఈ అవకాడో మాస్క్ ను వేసుకుంటే ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.పిగ్మెంటేషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.అర‌వైలోనూ యంగ్ గా కనిపించాలని ఆరాటపడేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Advertisement

తాజా వార్తలు