Kalaburag Temple : గుడి ముందు చెప్పులు కట్టి నమస్కరిస్తే కోరికలు తీరిపోతాయా.. ఎక్కడంటే..

మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.

ప్రతిరోజు చాలామంది భక్తులు దేవయాలకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.మరి కొంతమంది భక్తులు దేవాలయాలలో వారి కోరికలు తీరడానికి మొక్కులు చెల్లించుకునే పద్ధతి ఉంటుంది.

దాదాపుగా తిరుపతి, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు చాలా మంది తల నీలాలు సమర్పించుకుంటారు.అంతేకాకుండా కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటారు.

అయితే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఓ వింత పద్ధతి ఉంది.కర్ణాటకలోని కలబురగి జిల్లాలో కొనసాగుతున్న ఈ విచిత్ర ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement
If You Tie Your Sandals And Bow In Front Of The Temple, Will Your Wishes Come Tr

ఆలయం ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.కలబురగి జిల్లా అలంద్ తాలూకాలోని గోల బి గ్రామంలో అమ్మవారి ఆలయం ముందు కొత్త చెప్పులను కట్టే సంప్రదాయం చాలా సంవత్సరాల నుంచి ఉంది.

దీపావళి పండుగ తర్వాత పంచమి, పౌర్ణమి నాడు గోల బి గ్రామంలో లక్కమ్మదేవి జాతర చేస్తూ ఉంటారు.అవును, అమ్మవారి గుడి ముందు భక్తులు కొత్త పాద రక్షలు కొని తెచ్చి ఇక్కడ కట్టి భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

చాలా ఏళ్లుగా ఇక్కడ అలాంటి సంప్రదాయం జరుగుతూనే ఉంది.ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు తమ సమస్యలను అమ్మవారు తీరుస్తుందని జాతర సమయంలో గుడి ముందు చెప్పులు కట్టేస్తూ ఉంటారు.

గోల గ్రామంలోని లక్కమ్మ దేవి గుడి వదిలి రాత్రిపూట బయట తిరుగుతూ ఉంటుంది.ఆమె ఈ చెప్పులు ధరించి తిరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు.

If You Tie Your Sandals And Bow In Front Of The Temple, Will Your Wishes Come Tr
న్యూస్ రౌండప్ టాప్ 20

అందువల్లే ఉదయానికే ఆ చెప్పులు అరిగిపోతాయని అక్కడి భక్తులు చెబుతారు.అంటే దాని అర్థం గురించి అమ్మవారు తిరగడం వల్ల అలా జరిగిందని అక్కడి భక్తులు నమ్ముతారు.ఇదంతా అమ్మవారి శక్తితో జరుగుతుందని ప్రజల నమ్మకం.

Advertisement

ఈ ఆలయంలో దేవుడి ముఖం కనిపించదు.బదులుగా, ప్రతి ఒక్కరూ దేవుని వీపుకు నమస్కరిస్తారు.

తాజా వార్తలు