Hair fall : తల స్నానం చేసినప్పుడు జుట్టు విపరీతంగా రాలుతుందా? అయితే ఈ చిట్కా మీకోసం!

సాధారణంగా కొందరికి మామూలు సమయం తో పోలిస్తే తలస్నానం చేసే సమయంలో జుట్టు చాలా అంటే చాలా విపరీతంగా ఊడిపోతుంటుంది.

ఈ క్రమంలోనే జుట్టు రాలకుండా ఉండడం కోసం ఖరీదైన షాంపూను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.

అయినా సరే సమస్య అదుపులోకి రాకుంటే ఏం చేయాలో తెలీక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే తలస్నానం చేసే సమయంలో జుట్టు రాలనే రాలదు.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్‌ వాటర్ పోసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉద‌యాన్నే నానబెట్టుకున్న బియ్యం, మెంతుల నుంచి వాటర్ ను స్ట్రైప‌ర్‌ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.చివరగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపు వేసి మిక్స్ చేయాలి.

ఆ త‌ర్వాత‌ ఈ మిశ్రమాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.అయితే హెయిర్ వాష్ చేయడానికి గంట ముందు గోరు వెచ్చని నూనె తలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

ఆపై హెయిర్ వాష్ కనుక చేసుకుంటే జుట్టు అస్సలు రాలదు.పైగా ఈ చిట్కాను వారంలో రెండు సార్లు కనుక పాటిస్తే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారతాయి.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.

మరియు జుట్టు షైనీ గా సైతం మెరుస్తుంది.కాబట్టి తల స్నానం చేసినప్పుడు జుట్టు విపరీతంగా రాలుతుందని బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు