అబ్బాయిలు.. గ‌డ్డం ద‌ట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

సాధార‌ణంగా చాలా అమ్మాయిలు గ‌డ్డం( Beard ) ద‌ట్టంగా ఉన్న అబ్బాయిల‌నే ఎక్కువ‌గా లైక్ చేస్తుంటారు.

అబ్బాయిలు కూడా క్లీన్ షేవ్ క‌న్నా గ‌డ్డాన్ని ఒత్తుగా పెంచ‌డానికే ఇష్ట‌ప‌డుతుంటారు.

అయితే కొంద‌రిలో గ‌డ్డం గ్రోత్( Beard Growth ) అనేది స‌రిగ్గా ఉండ‌దు.పోష‌కాల కొర‌త‌, ఒత్తిడి, హార్మోన్ ఛేంజ్‌, కఠినమైన కెమికల్ లోషన్లు, క్రీములు వాడ‌టం ఇందుకు కార‌ణం కావొచ్చు.

అయితే గడ్డం దట్టంగా మరియు సమానంగా పెరగాలంటే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ను త‌ప్ప‌క ఫాలో అవ్వండి.గడ్డం పెరుగుదలకు సరైన ఆహారం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం.

ప్రోటీన్( Protein ) అధికంగా ఉండే గుడ్లు, చేపలు, మాంసం, పప్పులు, నట్స్ ను డైట్ లో చేర్చుకోండి.అలాగే విటమిన్ ఎ, విట‌మిన్ బి7, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, జింక్ అధికంగా ఉండే క్యారెట్, పుచ్చకాయ, పాలకూర, నిమ్మ, బాదం, వాల్‌నట్స్, బీన్స్, అవిసె గింజలను తినండి.

Advertisement

ఆరోగ్య‌క‌ర‌మైన గ‌డ్డం పెరుగుద‌ల‌కు ఇవి ఎంత‌గానో స‌హ‌క‌రిస్తాయి.

అలాగే ఆముదం( Castor Oil ) గ‌డ్డాన్ని ద‌ట్టంగా పెంచ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.వారానికి రెండు సార్లు ఆముదాన్ని గ‌డ్డానికి రాసి మ‌ర్దాన చేయండి.ఒక‌వేళ మీరు ఆముదానికి బదులుగా బాదం ఆయిల్ ను( Badam Oil ) కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఎక్కువ ఒత్తిడి వల్ల గ‌డ్డం పెరుగుద‌ల‌ మందగిస్తుంది.కాబ‌ట్టి ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు యోగా, వ్యాయామం చేయండి.

రోజుకు క‌నీసం ఏడు నుంచి ఎనిమిది గంట‌ల నిద్ర ఉండేలా చూసుకోండి.కఠినమైన కెమికల్ లోషన్లు, క్రీములకు బ‌దులుగా సహజమైన ఆయిల్స్, హెర్బల్ ఉత్పత్తులను ఉప‌యోగించండి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

నెలలో ఒకసారి గడ్డాన్ని ట్రిమ్ చేయండి.దాంతో గ‌డ్డం స‌మానంగా, దట్టంగా పెరుగుతుంది.రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి.

Advertisement

చర్మానికి తేమ అందించే మాయిశ్చరైజర్ వాడాలి.వారానికి రెండు సార్లు ముఖ చ‌ర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

త‌ద్వారా చ‌ర్మంపై పేరుకుపోయిన మురికి, మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి.గ‌డ్డం చ‌క్క‌గా పెరుగుతుంది.

తాజా వార్తలు