కొత్త ఏడాది వ‌స్తోంది.. ఈ ఐదు అల‌వాటు చేసుకుంటే ఆరోగ్యం ప‌దిలం!

మ‌రో నాలుగు రోజుల్లోనే 2021కు గుడ్ బై చెప్పి 2022కు వెల్క‌మ్ చెప్ప‌బోతున్నాము.కొత్త ఏడాది వ‌స్తోందంటే చాలా మంది త‌మ‌ను తాము అభివృద్ధి చేసుకునేందుకు జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచీ మంచి ప‌నులు చేయ‌డం అల‌వాటు చేసుకుంటారు.

అయితే ప్ర‌తి మ‌నిషికీ అన్నిటికంటే ముఖ్య‌మైన‌ది ఆరోగ్యం.సిరి సంప‌ద‌లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగుంటేనే ఆనందంగా, ప్ర‌శాంతంగా ఉండ‌గ‌ల‌ము.

అందుకే ఆరోగ్యంగా ఉండాలీ అనుకునే వారు జ‌న‌వ‌రి 1 నుంచీ ఇప్పుడు చెప్ప‌బోయే ఐదింటినీ అల‌వాటు చేసుకోండి.

Five Habits, Health, Improve Health, Health Tips, Good Health, Latest News, Hea

- ఆహారం అంటే పోష‌కాహార‌మే తీసుకోవాల‌ని అంద‌రికీ తెలుసు.అయితే తాజా కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, పండ్లు, న‌ట్స్‌, తృణధాన్యాలు వంటి పోష‌కాహారం తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో.టైమ్‌కి తీసుకోవ‌డం కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యం.

Advertisement
Five Habits, Health, Improve Health, Health Tips, Good Health, Latest News, Hea

బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, డిన్న‌ర్‌..

ఈ మూడింటినీ టైమ్ టూ టైమ్ తీసుకోవాలి.- హెర్బ‌ల్ టీ..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్ర‌తి రోజూ ప్ర‌తి ఒక్క‌రూ ఉద‌యాన్నే ఒక క‌ప్పు హెర్బ‌ల్ టీని ఖ‌చ్చితంగా తీసుకుంటే.శ‌రీరంలో ట్యాక్సిన్లు అన్నీ బ‌య‌ట‌కు పోవ‌డంతో పాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

కాబ‌ట్టి, అల్లం టీ, ల‌వంగం టీ, తుల‌సి టీ, గ్రీన్ టీ, అశ్వగంధ టీ ఇలా ఏదో ఒక హెర్బ‌ల్ టీని రోజూ తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి.

Five Habits, Health, Improve Health, Health Tips, Good Health, Latest News, Hea
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కిష్కింధపురి ' టీజర్ ఎలా ఉందంటే..?

- రెగ్యుల‌ర్ అర గంట పాటు వ్యాయామాలు చేయాలి.హెవీ హెవీ వ్యాయామాలు చేయ‌లేక‌పోతే క‌నీసం వాకింగ్ అయినా చేయాలి.త‌ద్వారా బ‌రువు అదుపులో ఉంటుంది.

Advertisement

శ‌రీరం ఫిట్‌గా, హెల్తీగా మారుతుంది.మ‌రియు నేటి టెక్నాల‌జీ యుగంలో త‌ర‌చూ ఒత్తిడికి గుర‌య్యే వారు ఎంద‌రో.

వారు రోజూ యోగా, ధ్యానం చేస్తే ఒత్తిడి, టెన్ష‌న్స్‌, ఆందోళ‌న వంటివి ప‌రార్ అవుతాయి.- ఆరోగ్యంగా ఉండాలంటే చెడ్డ ఆహారాల‌కు దూరంగా ఉండ‌టం కూడా ప్ర‌తి ఒక్క‌రూ అల‌వాటు చేసుకోవాలి.

ముఖ్యంగా ఫాస్డ్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌, ప్యాక్డ్ ఫుడ్స్‌, బేక‌రీ ఫుడ్స్‌, కూల్‌డ్రింక్స్‌, సోడాలు, షుగ‌ర్‌తో త‌యారు చేసిన ఫుడ్స్, సాల్టీ ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

- మ‌ద్యపానం, ధూమ‌పానం. ఈ రెండూ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.కాబ‌ట్టి, ఈ కొత్త ఏడాది నుంచి అయినా ఈ రెండిటినీ మానుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది.

తాజా వార్తలు