క్రమం తప్పకుండా వీటిని తింటే మీ మెదడు పాదరసంలా పనిచేయడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే మతి మరుపు( Memory loss ) అనేది ఒకానొక సమయంలో వయసు ఎక్కువగా ఉన్న వారిలో కనిపించేది.

కానీ ప్రస్తుత రోజులలో ఉన్న పరిస్థితుల్లో 30 నుంచి 40 సంవత్సరాల వయసు వారిలో కూడా మతి మరుపు ఎక్కువగా కనిపిస్తూ ఉంది.

అయితే ఈ విషయాన్ని చాలా మంది ప్రజలు గ్రహించలేకపోతున్నారు.జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

దానితో పాటు మెదడు పని తీరు కూడా మందగిస్తుంది.మతిమరుపు సమస్యను ముందుగా గుర్తిస్తే ఆ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవచ్చు.

కొన్ని ఆహారాలను తీసుకుంటే మతి మరుపు తగ్గిపోతుంది.

If You Eat These Regularly, Your Brain Will Work Like Mercury , Health , Healt
Advertisement
If You Eat These Regularly, Your Brain Will Work Like Mercury , Health , Healt

అలాగే మెదడు పని తీరును మెరుగుపరిచే పోషకాలు ఉన్న ఆహారం మీద దృష్టి పెట్టాలి.ముఖ్యంగా చెప్పాలంటే చేపలు( Fish ) మెదడు పని తీరును మెరుగుపరిచే ఆహారాలలో మొదటి స్థానంలో ఉన్నాయి.చేపలలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇవి మెదడు అదే అభివృద్ధి చెందడానికి,అలాగే నాడీ కణాన్ని నిర్మించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.దాంతో మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది.

పసుపును ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు.పసుపులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయనీ నిపుణులు చెబుతున్నారు.

If You Eat These Regularly, Your Brain Will Work Like Mercury , Health , Healt

పసుపులో( Turmeric ) ఉండే కర్కుమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.పసుపు మెదడు వ్యాధులను నియంత్రించడమే కాకుండా డిప్రెషన్ కు కూడా కారణమయ్యే అల్జీమర్స్ ను తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రోకలీలో( Broccoli ) విటమిన్ k సమృద్ధిగా ఉండటం వల్ల మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

విటమిన్ k ఎక్కువ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, తెలివి తేటలు మెరుగుపడతాయి.వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాలను వారంలో రెండు రోజులు మీ డైట్ లో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు