ఈ ఆహార పదార్థాలను కలిపి తింటే చెడు కొలెస్ట్రాల్ పరార్..!

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం గుండె సంబంధిత వ్యాధుల్లో మూడో భాగం అధిక కొలెస్ట్రాల్( Cholesterol ) వల్లే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కొద్ది శాతం కొలెస్ట్రాల్ శరీర కణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది.కానీ అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోతుంది.

కానీ సరైన ఆహారం తినడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే పప్పులో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.బ్రౌన్ రైస్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతుంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే ప్రతి భారతీయ వంటకం లో పసుపును సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు.దీనీకుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం( General of Nutrition and Metabolism ) చేసిన పరిశోధనలో పసుపు మిరియాల సప్లిమెంట్లు 12 వారాలపాటు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి త్వరగా తగ్గుతుంది.

బ్రిటిష్ జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదిక ప్రకారం పెరుగు తినడం వల్ల నాలుగు శాతం దాకా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.ఈ పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి.ఇవి జీర్ణ క్రియను పెంచి వాపు సమస్యలను దూరం చేస్తాయి.

బాదం, పెరుగు కలిపి తింటే రుచికరమైన స్నాక్స్ తో పాటు ఆరోగ్యం కూడా ఎంతో బాగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.నిమ్మరసంలో ఫ్లవనాయిడ్లు ఉంటాయి.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

వీటికి కూడా చెడు కొవ్వు ను తగ్గించే గుణం ఉంది.ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు