బ‌రువు త‌గ్గి బాడీ కూల్‌గా మారాలా? అయితే ఈ జ్యూస్ తాగాల్సిందే!

అస‌లే ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో బ‌రువు త‌గ్గ‌డం అంటే ఎంత క‌ష్ట‌త‌రంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మండే ఎండ‌లు, ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డం కోసం కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్స్ త‌దిత‌ర చ‌ల్లటి ఆహారాల‌ను లాగించేస్తుంటారు.దాంతో ఒంట్లో కొవ్వు విప‌రీతంగా పెరిగిపోతుంటుంది.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ టేస్టీ హెల్తీ జ్యూస్‌ను తీసుకుంటే బ‌రువు త‌గ్గొచ్చు.అదే స‌మ‌యంలో వేస‌వి వేడి నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటో, ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ స‌బ్జా గింజ‌లు, వాట‌ర్ పోసి నాన‌బెట్టుకోవాలి.

Advertisement

మ‌రోవైపు ఒక క్యారెట్ తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే ఒక క‌ప్పు పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను కూడా తీసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, పుచ్చ‌కాయ ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం మరియు కొద్దిగా వాట‌ర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలోనే మొద‌ట నాన‌బెట్టుకున్న స‌బ్జా గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని క‌లుపుకుంటే పుచ్చ‌కాయ‌-క్యారెట్‌ జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్ ను రోజుకు ఒక‌సారి గ‌నుక తాగితే.మెటబాలిజం రేటు పెరిగి కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది.

దాంతో వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఈ పుచ్చ‌కాయ‌-క్యారెట్‌ జ్యూస్ ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అధిక వేడి తొల‌గిపోయి బాడీ కూల్‌గా మారుతుంది.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

డీహైడ్రేష‌న్, స‌న్ స్ట్రోక్‌ వంటి స‌మ‌స్య‌ల బారిన‌ ప‌డ‌కుండా ఉంటారు.మ‌రియు వేస‌విలో వేధించే నీర‌సం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, చికాకు వంటి వాటికి సైతం దూరం ఉండొచ్చు.

Advertisement

తాజా వార్తలు