మిగిలిపోయిన రైస్ తో ఇలా చేస్తే చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చుకోవచ్చు!

సాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో తరచూ ఎంతో కొంత రైస్ మిగిలిపోతూ ఉంటుంది.

ఇలా మిగిలిపోయిన రైస్ ను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొందరు మరుసటి రోజు తింటారు.

కానీ కొందరు మాత్రం డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ అలా చేయకండి.

ఎందుకంటే మిగిలిపోయిన రైస్ తో చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చుకోవచ్చు.అవును మీరు విన్నది నిజమే.

అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు మిగిలిపోయిన రైస్ ను వేసుకోవాలి.

Advertisement

అలాగే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న రైస్ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.మిగిలిపోయిన రైస్ తో ఈ విధంగా చేస్తే చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

స్కిన్ పై ఎటువంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా దూరం అవుతాయి.

మార్కెట్లో లభ్యం అయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీములను వాడటం బదులుగా మిగిలిపోయిన రైస్ తో పైన చెప్పిన రెమెడీని పాటిస్తే చాలు చ‌ర్మ ఛాయను అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చు.అందంగా మెరిసిపోవచ్చు.పైగా చర్మం మృదువుగా కోమలంగా కూడా మారుతుంది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

కాబట్టి ఇకపై రైస్ మిగిలిపోతే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వాడటానికి ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు