వారంలో కేవలం ఒక్కసారి ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్, డార్క్ స్పాట్స్ అన్ని మాయమవుతాయి!

బిజీ లైఫ్ స్టైల్ కారణంగా కొందరికి చర్మ సౌందర్యాన్ని పట్టించుకునేంత సమయం ఉండదు.

దీని కారణంగా చర్మం పై డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ వంటివి ఏర్పడతాయి.

ఇవి చర్మాన్ని డల్ గా మరియు డార్క్ గా మారుస్తాయి.దీంతో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలియక, చర్మం కోసం తగిన సమయాన్ని కేటాయించలేక తెగ హైరానా పడిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉంటే అస్సలు చింతించకండి.ఎందుకంటే వారంలో కేవలం ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే బ్లాక్ హెడ్స్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్ ఇలా అన్ని మాయమవుతాయి.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఓ చూపు చూసేయండి.

Advertisement
If You Do This Once A Week, All Blackheads And Dark Spots Will Disappear! Blackh

ముందుగా ఒక కలబందను తీసుకుని నిలువుగా కట్‌ చేసుకోవాలి.ఇప్పుడు ఒక కలబంద ముక్కపై హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి ముఖానికి సున్నితంగా రబ్ చేసుకోవాలి.

కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు ఈ విధంగా స్క్రబ్బింగ్‌ చేసుకుని.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

If You Do This Once A Week, All Blackheads And Dark Spots Will Disappear Blackh

ఆ తర్వాత ఒక బౌల్ లో రెండు గ్లాసుల వాటర్, గుప్పెడు పుదీనా ఆకులు, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించాలి.ఇది మరిగించిన వాటర్ తో ముఖానికి కనీసం ప‌ది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి.చివరిగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

If You Do This Once A Week, All Blackheads And Dark Spots Will Disappear Blackh

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజ‌ర్ ను రాసుకోవాలి.వారంలో కేవలం ఒక్కసారి ఈ విధంగా చేస్తే చర్మంపై ముదురు, మొండి మచ్చలు మాయం అవుతాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ తొలగిపోయి.చర్మం కాంతివంతంగా మారుతుంది.

Advertisement

స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మరియు క్లియర్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతమవుతుంది.

తాజా వార్తలు