శుక్రవారం రోజు ఈ ముఖ్యమైన పనులను చేస్తే.. లక్ష్మీదేవి ఆగ్రహించడం వల్ల ఆర్థిక సమస్యలు తప్పవు..!

సనాతన ధర్మం ప్రకారం వారంలో ప్రతి రోజు ఒక్కొక్క దేవత లేదా దేవుడుని పూజించడానికి పవిత్రమైనదిగా భావిస్తారు.

ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం( Friday ) రోజు లక్ష్మి దేవి( Goddess Lakshmi ) ఆరాధనకు, పూజకు అంకితం చేయబడింది.

అదే సమయంలో శుక్రవారం శుక్ర గ్రహానికి కూడా సంబంధం కలిగి ఉంది.అటువంటి పరిస్థితుల్లో శుక్రవారం సంబంధించిన పరిహారాలు చేయడం ద్వారా సాధకుడు ప్రయోజనాలను పొందుతాడు.

అయితే శుక్రవారం లో కొన్ని పనులు చేయడంపై నిషేధం విధించారు.ఇలా చేయడం వలన సంపాదకు దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

శుక్రవారం చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

If You Do These Important Things On Friday Due To Lakshmi Devis Wrath, Financia
Advertisement
If You Do These Important Things On Friday Due To Lakshmi Devi's Wrath, Financia

ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం రోజు ఎవరి దగ్గర అప్పు ( debt )తీసుకోకూడదు.ఎవరికి అప్పు కూడా ఇవ్వకూడదు.ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి ఈ రోజున ఎలాంటి లావాదేవీలు చేయకూడదు.కొంతకాలంగా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే శుక్రవారం ప్రారంభించకూడదని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

ఇలా చేయడం వల్ల అ శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

If You Do These Important Things On Friday Due To Lakshmi Devis Wrath, Financia

శుక్రవారం పూజా వంటగదికి సంబంధించిన వస్తువులను అసలు కొనకూడదు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో పురోగతికి ఆటంకం వచ్చే అవకాశం ఉంది.హిందూ మత విశ్వాసాల ప్రకారం అమ్మాయిలను దేవతా స్వరూపులుగా భావిస్తారు.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

ఆర్థికంగా బలహీనంగా ఉండే వారు జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకుంటే శుక్రవారం రోజు ఏ అమ్మాయిని లేదా స్త్రీ ని అవమానించకండి.ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని చాలామంది పెద్దవారు చెబుతారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే శుక్రవారం రోజున పంచదార ( sugar )దానం చేయకూడదు.ఎందుకంటే చక్కెర శుక్ర గ్రహానికి సంబంధించింది.ఇలా చక్కెర దానం చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుడు బలహీనపడతాడని చాలామంది జ్యోతిష్యా నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు