బిగ్‌బాస్‌ 3 విజయ్‌ దేవరకొండ చేస్తే... నిర్వహకుల మాట ఏంటీ?

తెలుగు ప్రేక్షకులు బిగ్‌బాస్‌పై ఆధరణ చూపుతున్నారు.పెద్ద ఎత్తున టీఆర్పీ రేటింగ్‌ దక్కింది.

మొదటి రెండు సీజన్‌లు కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌ దక్కించుకున్న బిగ్‌బాస్‌ త్వరలోనే మూడవ సీజన్‌ ప్రారంభంకు సిద్దం అవుతుంది.నాని రెండవ సీజన్‌కు హోస్టింగ్‌ చేశాడు.

అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటూ మూడవ సీజన్‌కు ఆయన కొనసాగే అవకాశం లేదు.ఎన్టీఆర్‌ను మళ్లీ రంగంలోకి దించాలని భావించినా కూడా అది సాధ్యం కాలేదు.

ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రంతో బిజీగా ఉన్న కారణంగా నాగార్జునను బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ కోసం తీసుకు రావాలని నిర్వహకులు భావిస్తున్నారట.నాగార్జునకు ముందు విజయ్‌ దేవరకొండను కూడా ఈ షో కోసం పరిశీలించారని, ఆయనతో చర్చలు కూడా జరిపారు అంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే ఆ వార్తలపై క్లారిటీ అయితే రాలేదు.పెద్ద ఎత్తున వస్తున్న వార్తల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఈ విషయమై చర్చ మొదలు అయ్యింది.

బిగ్‌బాస్‌కు విజయ్‌ దేవరకొండ హోస్ట్‌ అయితే ఎలా ఉంటుంది అనే చర్చ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.విభిన్నమైన మాట తీరుతో విజయ్‌ దేవరకొండ అయితే షోను రక్తి కట్టిస్తాడు అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం వరుస సినిమాల కారణంగా విజయ్‌ దేవరకొండ బిగ్‌బాస్‌కు నో చెప్పాడట.

విజయ్‌ దేవరకొండ నో చెప్పడం వల్లే నాగార్జునను అప్రోచ్‌ అయ్యారని తెలుస్తోంది.ఒక వేళ నాగార్జున కాకుండ విజయ్‌ దేవరకొండ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తే అప్పుడు షోలో పాల్గొనే వారిలో ఎక్కువ శాతం ఆయన కంటే సీనియర్స్‌ అయ్యి ఉంటారు.అలా అయితే షోను విజయ్‌ దేవరకొండ సరిగా నిర్వహించలేరు అని అభిప్రాయం వ్యక్తం చేశారట.

మనిషి చివరి క్షణాలలో.. ఈ వస్తువులు దగ్గర్లో ఉంటే స్వర్గం ఖాయం..!

ఆ కారణంగా విజయ్‌ దేవరకొండను పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.విజయ్‌ దేవరకొండకు ఇంకాస్త స్టార్‌డం పెరిగితే అప్పుడు రంగంలోకి దించితే బాగుంటుందని కూడా కొందరు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు