Brahma muhurtam : బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తూ ఉన్నాయా.. అయితే జరిగేది ఇదే..!

సాధారణంగా చెప్పాలంటే ప్రతి మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి.వాటిలో కొన్ని శుభకరమైనవి ఉంటాయి.

మంచి కలలు ( sweet dreams )వచ్చినప్పుడు ఏమీ అనిపించదు.చెడ్డ కలలు వచ్చినప్పుడు కొంత మంది ఎక్కువగా భయపడుతూ ఉంటారు.

కానీ స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కొన్ని కలలు నిజమవుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రతి రాత్రి ఏదో ఒక కల వస్తూ ఉంటుంది.

వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే మనకు గుర్తుంటాయి.మరి కొన్నిటిని పూర్తిగా మర్చిపోతాం.

Advertisement

కానీ కొన్ని కలలు సంతోషంగా ఉంటే, మరికొన్ని కలలు భయంకరంగా ఉంటాయి.అంతే కాకుండా స్వప్న శాస్త్రం( science of dreams ) ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు కచ్చితంగా నిజమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

బ్రహ్మ ముహూర్తం( Brahma muhurtam ) అంటే తెల్లవారు జామున మూడు గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది.ఈ సమయంలో వచ్చే కలలు ఏవి నిజమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో విరిగిన పన్ను కనిపిస్తే శుభ సూచకం అని నిపుణులు చెబుతున్నారు.

మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.అలాగే బ్రహ్మ ముహూర్త సమయంలో వచ్చిన కలలో నవ్వుతున్న పసిపిల్లవాడు( smiling toddler ) కనిపిస్తే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి ఈ కల ఆర్థిక లాభాలను కూడా సూచిస్తుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

ఇంకా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తంలో కలశం లేదా నీటితో నిండిన కుండను చూస్తే వారికి మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.ఆ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి.

Advertisement

అంతేకాకుండా చంద్రుడు చల్లదనానికి, శాంతికి సంకేతం అని దాదాపు చాలామందికి తెలుసు.కలలో చంద్రుడు రావడం అంటే మామూలు విషయం కాదు.

చందమామ వచ్చిన తర్వాత రోజు నుంచి వారి జీవితం మొత్తం మారిపోతుంది.కష్టాలు కూడా మిమ్మల్ని చూసి పారిపోతాయి.

అప్పటివరకు ఉన్న బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఎటువంటి సమస్య లేకుండా హాయిగా జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు.అలాగే కుటుంబంలో గొడవలు, వివాదాలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చు.

తాజా వార్తలు