ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?.. దేవినేని ఉమ

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అరాచకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు.

పార్టీని వీడినందుకే ఆదిరెడ్డి అప్పారావును అరెస్ట్ చేయించారని ఆరోపించారు.ఎర్రన్నాయుడు, ఆదిరెడ్డి కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

కుప్పంలో కావాలనే వైసీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.పనికి మాలిన నేతలంతా కలిసి రజనీకాంత్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని బయటపెడతామని వెల్లడించారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు