పన్నీర్ ను ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యం పై చెడు ప్రభావం ఉంటుందా...

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు.

ఏ తినే పదార్థమైన ఎలా తినాలి వేటితో కలుపుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అని ఆలోచిస్తున్నారు.

అలాగే పాల ఉత్పత్తి అయినా పన్నీర్ ను ప్రతిరోజు చాలా వంటకాలలో రుచికోసం చాలామంది ప్రజలు ఉపయోగిస్తుంటారు.ముఖ్యంగా మట్టర్ పన్నీర్, పన్నీర్ టిక్కా, కడాయి పన్నీర్, పన్నీర్ పకోడా లాంటి వంటకాలు మనదేశంలో చాలా ప్రాచుర్యం పొందాయి.

పన్నీర్ రుచితో పాటు మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లను పోషకాలను అందిస్తుంది.పన్నీర్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్న దీనిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం చాలా సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

పన్నీర్ లో మాంసాహారంతో సమానంగా ఉండే ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.కావున శాఖాహారుల్లో ప్రోటీన్ లోపాన్ని సరి చేయడానికి పనీర్ అద్భుతమైన ఆహారంగా అని కచ్చితంగా చెప్పవచ్చు.

Advertisement

పన్నీర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.అయితే పనీర్లో కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ మరింత పెరిగి గుండె సమస్య ఎక్కువ అయ్యే ప్రమాదముంది.

జీర్ణశక్తి సమస్య ఉన్నవారు, ఉబ్బసం వంటి వ్యాధులతో బాధపడేవారు పన్నీర్ కు దూరంగా ఉండటమే మంచిది.ముఖ్యంగా రాత్రి భోజనంలో పనీర్ ను ఆహారంలో తీసుకుంటే ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు జీర్ణం అవ్వడానికి అధిక సమయం తీసుకుని నిద్రలేమి సమస్య ఏర్పడే అవకాశం ఉంది.తరచూ వాంతులు విరేచనాలతో బాధపడేవారు పనీర్ ను ఆహారంలో తీసుకోకపోవడమే మంచిది.

ఎందుకంటే పనీర్లో అధిక ప్రోటీన్లు ,కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి పన్నీర్ ను ఎంత తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు