కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ డ్రింక్స్ తీసుకుంటే.. డయాలసిస్ తో పనే ఉండదు..?

ప్రస్తుతం ప్రతి పదిమందిలో నలుగురు కిడ్నీ సమస్యలతో( kidney problems ) బాధపడుతున్నారు.రోజు రోజుకి కిడ్నీ వ్యాధి బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది.

అయితే చాలామంది కిడ్నీ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోవడం వలన అది పెరిగి పెద్దదైపోతుంది.దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

చాలామంది కిడ్నీ సమస్యలు తో బాధపడుతున్న వారు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు.అయితే కేవలం మెడిసిన్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ వ్యాధులను తగ్గించుకోవచ్చు.

అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి డయాలసిస్ అవసరం లేకుండానే ఈ మూడు రకాల డ్రింక్స్ తాగితే మంచిదని వైద్యులు అంటున్నారు.

Advertisement

ఇక ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.లెమన్ వాటర్( Lemon water ) మన శరీరానికి చాలా అవసరం అని మనందరికీ తెలిసిన విషయమే.నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ముఖ్యంగా వేసవిలో లెమన్ వాటర్ తీసుకోవడం వలన అద్భుతంగా పనిచేస్తుంది.అలాగే పొట్టకి సంబంధించిన సమస్యలకు లెమన్ వాటర్ మంచి ఉపశమనంగా సహాయపడుతుంది.

ఈ లెమన్ వాటర్ లో ఉండేటటువంటి విటమిన్ సి( Vitamin C ) శరీరంలో విటమిన్ లోటుని పూర్తిచేస్తాయి.అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను బయటకు నెట్టేయడంలో లెమన్ వాటర్ చాలా ఉపయోగపడతాయి.

వేడి నీటిలో నిమ్మ రసం కలిపి తీసుకున్నట్లయితే కిడ్నీలు డీటాక్స్ అవుతాయి.అలాగే కొబ్బరినీళ్లు, యాలకులు ( Coconut water , cardamom )వల్ల కలిగే లాభాలు కూడా మనందరికీ తెలిసిందే.అయితే ఈ నీటిలో యాలకులు అద్భుతమైన ఔషధముగా ఉపయోగపడతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కొబ్బరి నీళ్ళు నిత్యము తాగినట్లయితే శరీరంలో నీటి కొరత అస్సలు ఉండదు.అలాగే యాలకుల వలన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

Advertisement

అదేవిధంగా నోటి దుర్వాసన కూడా పోతుంది.అంతేకాకుండా కిడ్నీల సంరక్షణ కోసం కొబ్బరినీళ్లు, యాలకుల మిశ్రమం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

కొబ్బరి నీళ్లలో యాలకులు పొడి కలిపి తీసుకోవడం వలన కిడ్నీలు డీటాక్స్ అవుతాయి.

తాజా వార్తలు