యాపిల్ పండ్లతో ఇడ్లీ.. రుచి చూస్తే మైమరిచిపోతారు!

మన భారతీయులు ఎన్నో విషయాలలో తమ ప్రతిభను చాటుకుంటుంటారు.ఇలా కూడా చేయొచ్చా అనేలా ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పుతుంటారు.

ఇక ఫుడ్ విషయానికి వస్తే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడ ప్రజలకు నచ్చిన ఫుడ్ దొరుకుతుంది. దక్షిణ భారత దేశంలో ఖచ్చితంగా ప్రజలు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా ఇడ్లీ తినడానికి ఇష్టపడుతుంటారు.

ఇడ్లీలు ఉత్తివే తింటే రుచి ఏమీ ఉండదు.కానీ వేడి వేడి ఇడ్లీలను పల్లీల చట్నీతో, నెయ్యి వేసుకుని కారంపొడితో నంజుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.

ఇలా వేడి వేడి ఇడ్లీలు ఇంట్లో వెరైటీగా తల్లులు తయారు చేస్తుంటారు.ఇలాంటి ఇడ్లీలను వెరైటీగా కొందరు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు.

Advertisement
Idli With Apple Fruits Apple, Idli , Viral Latest, News Viral, Social Media

ఇదే కోవలో ప్రస్తుతం ఫ్రూట్ ఇడ్లీ( Fruit Idli ) బాగా ఫేమస్ అవుతోంది.ఇడ్లీ పిండిలో ఫ్రూట్స్ కలిపి చేసిన ఇడ్లీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

దీని గురించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Idli With Apple Fruits Apple, Idli , Viral Latest, News Viral, Social Media

మృదువైన, ఆరోగ్యకరమైన దక్షిణ భారతీయ వంటకం ఇడ్లీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఏ మాత్రం ఇవి రుచిగా లేకపోయినా, వీటికి చట్నీ, కారంపొడి వంటివి జోడించి తింటే చాలా బాగుంటుంది.చాలా మందికి సాంబారు ఇడ్లీలు అంటే ఇష్టం.

అయితే ఇడ్లీలనే రుచికరంగా మార్చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.ఇదే కోవలో ఫ్రూట్ ఇడ్లీలను తయారు చేస్తున్నారు.

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?

ఇదే కోవలో ఓ వ్యక్తి యాపిల్ పండ్లను( Apple fruit ) ముక్కలుగా కట్ చేశాడు.అనంతరం ఇడ్లీ పిండిలో ఆ యాపిల్ ముక్కలను కలిపాడు.

Advertisement

ఆ మిశ్రమాన్ని ట్రేలో వేసి కొద్ది సేపు ఉడికించాడు.

తర్వాత బయటకు తీయగా వేడి వేడి ఫ్రూట్ ఇడ్లీలు తయారయ్యాయి.తర్వాత ఇడ్లీలను తీసి ఓ ప్లేట్‌లో ఉంచాడు.దానిపై మరోసారి సన్నగా కోసిన యాపిల్ ముక్కలను పెట్టాడు.

అంతేకాకుండా దానిమ్మ గింజలను ( Pomegranate seeds )కూడా ఉంచాడు.ఈ ఫ్రూట్ ఇడ్లీలకు మూడు రకాల చట్నీలను, సాంబారును ప్లేట్‌లో పెట్టి అందించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.ఇలా వెరైటీగా ప్రయత్నించిన వారిపై నెటిజన్లు ప్రశంసలుకురిపిస్తున్నారు.

అదే సమయంలో ఇడ్లీ రుచిని చెడగొట్టొద్దంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు