వాళ్లు లేకపోతే అసలు పుష్ప సినిమానే లేదు... అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప2 ( Pushpa 2 ) సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఇటీవల పాట్నాలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా చెన్నైలోని లియో ముత్తు ఇండోర్‌ స్టేడియంలో ఈ సినిమాకి సంబంధించిన వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేశారు.ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం అలాగే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా పాల్గొన్నారు.

Icon Star Allu Arjun Sensational Comments On Pushpa Makers , Allu Arjun, Pushpa

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.చెన్నై అంటేనే నాకు ఏదో ఒక తెలియని అనుభూతి వస్తుంది.నా జీవితంలో మొదటి 20 సంవత్సరాలు ఈ చెన్నైలోనే గడిచిపోయాయని చెన్నై గురించి బన్నీ కామెంట్స్ చేశారు.

ఇక సినిమా గురించి ఈయన మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ వారు లేకపోతే పుష్ప సినిమానే లేదని అల్లు అర్జున్ తెలిపారు.మాకు సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ కూడా మైత్రివారు చేసిన విధంగా పుష్ప సినిమాని ఏ నిర్మాణ సంస్థ చేయలేరని బన్నీ తెలిపారు.

Icon Star Allu Arjun Sensational Comments On Pushpa Makers , Allu Arjun, Pushpa
Advertisement
Icon Star Allu Arjun Sensational Comments On Pushpa Makers , Allu Arjun, Pushpa

ఇలా సుకుమార్ గారు, నిర్మాతలు కెమెరామెన్ ఆర్ట్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నా ప్రాణ స్నేహితుడు నేను చేసిన 20 సినిమాలకు ఆయనే 10 సినిమాల వరకు పనిచేశారు.నా సినిమా అంటే ప్రేమతో పని చేస్తారని దేవి శ్రీ పై బన్నీ కామెంట్స్ చేశారు.

ప్రతిసారి బన్నీ నన్ను వేదికపై డాన్స్ చేయమని అడుగుతారు కానీ నేను మాత్రం టికెట్ కొనుక్కొని వెళ్లి థియేటర్లో చూడు అంటూ సమాధానం చెబుతానని చెప్పారు.నేను కెరీర్‌లో తొలిసారి ఓ పాటకు డాన్స్ చేసేటప్పుడు ముందుగానే జాగ్రత్తపడ్డాను.

అందుకు కారణం డాన్సింగ్ క్వీన్ శ్రీలీల( Sreeleela ) .తను చాలా హార్డ్ వర్కింగ్ మాత్రమే కాదు సూపర్ క్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు.ఇక నాలుగు సంవత్సరాలుగా రష్మిక( Rashmika ) ను చూస్తున్నాను ఈ సినిమాలో నేను ఇంత బాగా నటించాను అంటే ఆమె ఇచ్చిన కంఫర్ట్ అంటూ రష్మిక పై కూడా ప్రశంసలు కురిపించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు