డోలో- 650 తయారీ సంస్థకు ఐసీఏ క్లీన్ చిట్

డోలో -650 త‌యారీ సంస్థ‌, బెంగ‌ళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ మాత్రలను సిఫారసు చేసినందుకు వైద్యులకు మైక్రోల్యాబ్స్ పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ఆరోపణలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్స్, నేష‌న‌ల్ ఫార్మాస్యూటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీకి ఓ నివేదిక‌ను ఐపీఏ స‌మ‌ర్పించింది.ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను మైక్రోల్యాబ్స్ అనుసరించినట్టు పేర్కొంది.

అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్ప‌ష్టం చేసింది.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు