మెగాస్టార్ తర్వాత ఆ స్థానం చరణ్ దే... ఆయనే నా ఫేవరెట్ హీరో: అల్లు అర్జున్

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అల్లు అర్జున్(Allu Arjun) నేడు పుట్టినరోజు(Birthday ) వేడుకలను జరుపుకుంటున్నారు.

ఇక ఈయన పుట్టినరోజు కావడంతో అభిమానులు తనకు సంబంధించిన ఎన్నో రేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అలాగే కొన్ని ఓల్డ్ వీడియోలను కూడా నేడు వైరల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రామ్ చరణ్ (Ramcharan) గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ అభిమానులు షాక్ అవ్వగా రామ్ చరణ్ అభిమానులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.ఈ వీడియోలో భాగంగా రామ్ చరణ్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు.నేను రామ్ చరణ్ కు ఓ అభిమానిని ఆయన నా ప్రాణం కన్నా ఎక్కువ అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు.

నేను ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చూడాలనుకుంటున్నటువంటి హీరో రామ్ చరణ్.ఇదే నా కోరిక అంటూ బన్నీ మాట్లాడారు.నేను ఒక హీరోగా చెబుతున్నాను.

Advertisement

నేను చరణ్ అభిమానిని చరణ్ అంటే నాకు పిచ్చి.మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఆ స్థానంలో చరణ్ ను చూడాలన్నది నా కోరిక అంటూ రామ్ చరణ్ ని పొగుడుతూ అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బన్నీ ఫాన్స్ షాక్ అవుతున్నారు.

అయితే ఈయన మాటలతో చరణ్ ఫాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2(Pushpa 2)సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మాస్ హీరోగా ఎదగలనుకుంటున్న యంగ్ హీరోలు...
Advertisement

తాజా వార్తలు