Charmy Kaur: ఆ హీరో రెండో పెళ్లి చేసుకునేదాకా నేను పెళ్లి చేసుకోను ఛార్మి కామెంట్స్ వైరల్..!!

అందాల నటి ఛార్మి కౌర్ ( Charmy Kaur ) అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయినే.

అయితే ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా చేయడం లేదు ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారి పూరి జగన్నాథ్ చేసే కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది.

అయితే పూరి జగన్నాథ్ ఛార్మి కౌర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇక ఛార్మి కౌర్ ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇప్పటికీ సింగిల్గానే ఉంటుంది.

ఇక గతంలో సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీప్రసాద్ ( Devi Sri Prasad ) తో ప్రేమాయణం నడిపించి పెళ్లి వరకు వెళ్ళింది.కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది.

ఇక ఎప్పుడైతే చార్మి పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తో కలిసి ఆయన చేసే సినిమాలకు నిర్మాతగా చేస్తుందో అప్పటినుండి వీరిద్దరి మధ్య కూడా ఏదో రిలేషన్ నడుస్తోందనే వార్తలు వినిపించినప్పటికీ పూరి జగన్నాద్, ఛార్మి ఇద్దరు మా మధ్య అలాంటి రిలేషన్ లేదని జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఆ వార్తలకు క్లారిటీ ఇస్తూన్నారు.

I Wont Get Married Until That Hero Gets Married For The Second Time Charmis Com
Advertisement
I Wont Get Married Until That Hero Gets Married For The Second Time Charmis Com

అయితే రీసెంట్ గా ఛార్మి కౌర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ హీరో రెండో పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.ఇక విషయంలోకి వెళ్తే.ఛార్మికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్( Hrithik Roshan ) అంటే చెప్పలేనంత ఇష్టమట.

ఈ హీరోని తలుచుకుంటే ఆమెకు రాత్రులు నిద్ర కూడా పట్టదట.

I Wont Get Married Until That Hero Gets Married For The Second Time Charmis Com

ఇక మొదట హృతిక్ రోషన్ సుస్సెన్నా ఖాన్ ని పెళ్లి చేసుకున్న సమయంలో చాలా బాధపడిందట.ఇక హృతిక్ రోషన్ ప్రస్తుతం మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగానే ఉంటున్నారు.ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోలేదు.

కానీ ఆయన మళ్లీ పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ ఛార్మి( Charmy Kaur ) ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది.ప్రస్తుతం చార్మి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు