తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర పర్యవేక్షణ నాదే..: ఉత్తమ్ కుమార్

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్ర పర్యవేక్షణ బాధ్యత తనదేనని పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

రాహుల్ యాత్ర నేపథ్యంలో విజయవాడకు వచ్చిన ఆయన.

అక్కడి కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.దేశ వ్యాప్తంగా రాహుల్ యాత్రకు మంచి స్పందన లభిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్న ఆయన.యాత్రను విజయవంతం చేసేలా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు.

Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!
Advertisement