మిమ్మల్ని ఫాలో అవ్వను.. స్టార్ హీరో కి షాక్ ఇచ్చిన నెటిజన్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు మాధవన్ కూడా ఒకరు.

ఈయన కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

తెలుగులో కూడా ఈయన నటించిన పలు సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మాధవన్ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఇక చాలాకాలం తర్వాత మాధవన్ మొదటిసారి దర్శకత్వం వహించిన రాకెట్రీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తన సొంత నిర్మాణంలోనే అలాగే స్వీయ దర్శకత్వంలో మాధవన్ నటించారు.ఈ సినిమా ఈయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

ఇకపోతే మాధవన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

Advertisement

ఈ క్రమంలోనే మాధవన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే మాధవన్ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇందులో రణవీర్ మాధవన్ నుగట్టిగా హగ్ చేసుకున్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ లవ్ యు బ్రో అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక నెటిజన్ ఈ ఫోటోపై స్పందిస్తూ నేను మిమ్మల్ని ఫాలో అవ్వను అంటూ కామెంట్ చేశారు.ఈ విధంగా నేటిజన్ కామెంట్ చేయడంతో మాధవన్ రిప్లై ఇస్తూ ఓకే బ్రో నేను కూడా మిమ్మల్ని ఫాలో అవ్వను అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు