పుష్ప సినిమా చూసి వణికిపోయాను... విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప(Pushpa).

ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతలు సంపాదించాయి.ఇక ఈ సినిమాకి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇకపోతే తాజాగా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.పుష్ప సినిమా చూస్తున్నప్పుడు నాలో ఒణుకు పుట్టింది.ఒక సగటు ప్రేక్షకుడిగా ఈ సినిమాని మెచ్చుకున్నప్పటికీ ఒక రచయితగా నాలో ఏదో తెలియని అభద్రతా భావానికి గురయ్యానని తెలిపారు.

Advertisement

ఈ సినిమా చూస్తున్నప్పుడు కథ రాయడంలో నాకు అంత పట్టు లేదా అనే సందేహం కూడా కలిగిందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.ఇక ఈయన రచయితగా ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు.

ఇక ఈయన రచయితగా బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇలా విజయేంద్రప్రసాద్ కేవలం సౌత్ సినిమాలకు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కథలను అందించారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.ఇక పుష్ప సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకోవడంతో అంతకుమించిన అంచనాలతో పుష్ప సీక్వెల్ చిత్రం శరగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు