ఆ హీరోని చూడడం కోసం కారు వెంట పరిగెత్తాను: దుల్కర్ సల్మాన్

సీతారామం సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.

హనురాగవపూడి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సూపర్ హిట్ కావడంతో తిరిగి ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేశారు.హిందీలో కూడా ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని పెద్ద ఎత్తున పలువురు సినీ సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ విధంగా తెలుగులో స్టార్ హీరోగా మారిపోయిన దుల్కర్ సల్మాన్ తాజాగా చుపు.ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ చిత్రంలో నటించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇకపోతే ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది.

Advertisement

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక తనకి సల్మాన్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని ఆయన తన ఫేవరెట్ హీరో అని ఈ సందర్భంగా దుల్కర్ వెల్లడించారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన టీనేజ్ లో జరిగిన ఒక సంఘటన గురించి కూడా ఈయన తెలియజేశారు.ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ..

నేను స్నేహితులతో కలిసి ఆలివ్ కు వెళ్లాను.మేము చాలా ఉత్సాహంగా ఎంతో ఎంజాయ్ చేసాం అదే సమయంలో అటువైపుగా కారులో సల్మాన్ ఖాన్ వెళ్లడంతో ఒక్కసారిగా తనని చూడడం కోసం తన స్నేహితులతో కలిసి కారు వెంట పరిగెత్తానని దుల్కర్ సల్మాన్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ కారు దిగితే తనని చూడాలని భావించాము కానీ ఆయన మాత్రం కారు దిగలేదు.ఇకపోతే తాను హీరో అయినప్పటికీ ఇంతవరకు సల్మాన్ ఖాన్ ను కలవలేదని దుల్కర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు