వైసీపీ మంత్రులపై షాకింగ్ సెటైర్లు వేసిన హైపర్ ఆది.. ఏమన్నారంటే?

ప్రముఖ జబర్దస్త్(Jabardast) కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది(Hyper Adi) వైసీపీ మంత్రులను టార్గెట్ చేస్తూ తరచూ విమర్శలు చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.

ఏపీ మంత్రులు మీ అందరికీ తెలుసని ఒకాయన ఇప్పుడే గుడ్డు పెట్టింది కోడి అవ్వాలని అంటాడని చివరకు మనం పకోడి అవ్వడమే కానీ అది కోడి కాదని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

ఇలాంటి వాళ్లను జాబ్ అడగడం నూడుల్స్ బండి దగ్గరకు వెళ్లి పానీపూరి అడిగినట్టు ఉంటుందని ఆది తెలిపారు.ఒకాయన రికార్డులు తిరగరాస్తానని చెబుతాడని రికార్డులు తిరగరాయడం రికార్డింగ్ డ్యాన్స్ చేసినంత సులువు కాదని హైపర్ ఆది అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంకొకాయన పోలవరం (Polavaram)గురించి ఎప్పుడు అడిగినా త్వరలో పూర్తి చేస్తామని చెబుతాడని ఆయన అది కూడా గంట అరగంటలో అయిపోతుందని అనుకుంటాడని హైపర్ ఆది తెలిపారు.మొన్న నేను ఆయన డ్యాన్స్ చూశానని చలిమంట సంగతి దేవుడెరుగు చలిజ్వరం వచ్చి పడుకున్నానని ఆయన కామెంట్లు చేశారు.

ఇంకొకాయన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మీటింగ్ లను జన సైనికుల కంటే ఆసక్తిగా చూస్తాడని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.ఎప్పుడైతే పవన్ మీటింగ్ జరుగుతుందో అప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి గొప్ప వేదాంతిలా చెబుతాడని ఆయన చెప్పే జవాబుల్లో ఒక్కటి కూడా కరెక్ట్ గా ఉండదని హైపర్ ఆది కామెంట్లు చేశారు.పవన్ రిషికొండ గురించి అడిగితే ఈయన మణికొండ గురించి అనకొండ గురించి చెబుతాడని హైపర్ ఆది పేర్కొన్నారు.

Advertisement

ఆయన ఎమ్మెల్యేకు, మంత్రి పదవికి అర్హుడు కావచ్చని కానీ పవన్ ను అనడానికి అర్హుడు కాదని ఆది తెలిపారు.తాను రియల్ లైఫ్ లో సీరియస్ పొలిటీషియన్ అని ఆది వెల్లడించారు.మూడు పెళ్లిళ్లు చేసుకోనందుకు ఒక వైసీపీ మంత్రి ఫీల్ అవుతున్నారని ఆది అభిప్రాయపడ్డారు.

ఆది వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు