ముక్కు అవినాష్ బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లాడో చెప్పకనే చెప్పిన హైపర్ ఆది..!

ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.

గొడవలు, లవ్ అఫైర్స్, ఫైట్స్, అలగడం ఇలా వివిధ క్యారెక్టర్స్ రోజురోజుకి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి.

ఇక ఈ విషయం పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో జబర్దస్త్ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రోగ్రాం ఏది అంటే మొదటిగా చెప్పుకునే ప్రోగ్రామ్ గా పేరుతెచ్చుకుంది జబర్దస్త్.

Jabardasth Hyper Aadi About Mukku Avinash, Financial Problems, EMIs, Bigg Boss4

ఇక అందులో హైపర్ ఆది టీం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొంతమంది హైపర్ ఆది టీం పర్ఫామెన్స్ కోసమే జబర్దస్త్ చూసేంతల అతడు తన పంచులు వేస్తూ నవ్విస్తాడు.

కొన్నిసార్లు హైపర్ ఆది వేసిన పంచ్ లకు జడ్జీలు కూడా నవ్వలేక రివర్స్ పంచులు వేయలేక నానా తంటాలు పడుతుంటారు.ప్రస్తుతం జబర్దస్త్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్.

Advertisement

ఆయన ఎప్పటికప్పుడు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని జబర్దస్త్ లో తన స్కిట్ చేసే సమయంలో తాజాగా జరిగిన సంఘటనలకు సంబంధించి పంచ్ లను వేస్తుంటాడు.ఇక ఇదే క్రమంలో తాజాగా జబర్దస్త్ లో మరో టీం లీడర్ అయిన ముక్కు అవినాష్ పై పంచులు వేశాడు.

అది ఎలా అంటే.తాజాగా జబర్దస్త్ ప్రోగ్రాం ని ముక్కు అవినాష్ వదిలి మరీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే అసలు ముక్కు అవినాష్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని హైపర్ ఆది తేల్చిచెప్పేశాడు.ఏదైనా షో చేస్తూ బయటికి వెళితే ఆ షో లోకి మళ్ళీ తిరిగి రావడం అంటే చాలా కష్టమని, ఇలా వెళ్లి వారిని చాలా మందిని చూశాను అంటూ ముందుగా పంచ్ వేశాడు.

ఇక ముక్కు అవినాష్ విషయానికి వస్తే.తాజాగా తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి కూడా జబర్దస్త్ వారికి నష్టపరిహారం చెల్లించాడంటూ టాక్.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

అయితే, అసలు ఎందుకు ముక్కు అవినాష్ అలా చేశాడన్న విషయం హైపర్ ఆది తన స్కిట్ లో చెప్పకనే చెప్పేశాడు.ఇందుకు సంబంధించి అసలు విషయం ఏమిటంటే లాక్ డౌన్ సమయం కన్నా అవినాష్ కొత్త గా ఇల్లు కొన్నాడు.

Advertisement

అయితే ఆ తర్వాత కరోనా రావడం.తర్వాత షూటింగులు పూర్తిగా ఆగిపోవడంతో ఆయన పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు.

చివరికి ఈఎంఐ లు కట్టే పరిస్థితి లేకపోవడంతో జబర్దస్త్ లో వచ్చే సంపాదన కంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చే రెమ్యూనరేషన్ తో కాస్త బయటపడవచ్చని భావనతో ఆయన జబర్దస్త్ కి కొన్ని రోజులు విశ్రాంతి నిచ్చి మరి బిగ్ బాస్ హౌస్ లోకి చేరాడు.అయితే ఈ విషయాన్ని కాస్త అటూ ఇటుగా ఉన్నది ఉన్నట్లుగా హైపర్ ఆది తన స్కిట్ లో చెప్పేశాడు.

దీంతో హైపర్ ఆది అవినాష్ గురించి చెప్పిన మాటలు వాస్తవమేనని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు