హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్ రోడ్డుపై ప్రయాణించాలంటే ఈ రూల్స్ ఫాలో కావలసిందేనట.. !

ఔటర్‌ రింగ్ రోడ్డు అనగానే వేగంగా దూసుకెళ్ల వచ్చూ, వందల కిలోమీటర్లను అతి స్వల్ప వ్యవధిలో చేరుకోవచ్చని ఆలోచించే వారు లేకపోలేదు.

నగరంలోని ట్రాఫిక్‌తో విసిగిపోయిన దూరప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఔటర్ రింగ్ రోడ్దు ఎక్కితే చాలు క్షణాల్లో అనుకున్న చోటులో చేరుకుంటాం అని, హద్దు మీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారట.

ఇక నుండి ఆ పప్పులు ఏవి ఉడకవంటున్నారు అధికారులు.ఎందుకంటే హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్‌)పై కొత్త ట్రాఫిక్ రూల్స్‌ వచ్చేస్తున్నాయట.

ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేసే క్రమంలో నగరంలోనూ ట్రాఫిక్ రూల్స్ పకడ్బందిగా అమలు చేస్తున్న అధికారులు, ఇప్పుడు ఔటర్‌పై కూడా వేగ పరిమితికి సంబంధించిన గుర్తులు వేశారట.ఇకపోతే ఓఆర్ఆర్ మొత్తం ఫోర్ లైన్స్ ఉండగా, రెండు లైన్లను 100 కిలోమీటర్లకు, మరో రెండు లైన్లను 80 కిలోమీటర్ల గరిష్ట వేగానికి పరిమితం చేశారట.

కాగా 100 కిలోమీటర్ల గరిష్టవేగానికి 1, 2వ లైన్‌ను కేటాయించగా, 80 కిలోమీటర్ల వేగానికి 3, 4వ లైన్‌ నిర్ణయించారట.అదీగాక రోడ్డుపై స్పీడ్‌ లిమిట్‌కు సంబంధించిన గుర్తులు కూడా వేశారట.

Advertisement

అంటే, ఇక, వేగ పరిమితిని అనుసరించి లైన్లను ఫాలో కావాల్సి ఉంటుంది.ఆ ఎవరు చూస్తారని లైన్లు ఫాలో కాకపోయినచో జరిమానా తప్పదన్నమాట.

అంతే కాదు ఓవర్‌ స్పీడ్ గా వెళ్లితే ‌కూడా జరిమానాలుంటాయని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు