ఏపీలోని ఆ ముగ్గురు నేతలపై భారీగా బెట్టింగ్స్.. ఒక్కరు కూడా గెలవడం కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ( AP Polling ) పూర్తై వారం రోజులు అవుతోందనే సంగతి తెలిసిందే.

అయితే పోలింగ్ పూర్తైన తర్వాత ఏపీలోని ముగ్గురు నేతలపై ఎక్కువమంది బెట్టింగ్స్ కడుతున్నారని తెలుస్తోంది.

ఆ ముగ్గురు నేతలు లోకేశ్, రఘురామ కృష్ణంరాజు, షర్మిల కావడం గమనార్హం.ఈ ముగ్గురిలో గెలుస్తారని కొంతమంది బెట్టింగ్ కడితే ఓడిపోతారని మరి కొంతమంది బెట్టింగ్ కట్టడం గమనార్హం.

అయితే వైసీపీ నేతలు, అభిమానులు మాత్రం ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా గెలవడం కష్టమని కామెంట్లు చేస్తున్నారు.లోకేశ్( Lokesh ) మంగళగిరి నుంచి రఘురామకృష్ణంరాజు( Raghuramakrishna Raju ) ఉండి నుంచి పోటీ చేయగా షర్మిల( Sharmila ) కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం.

ముగ్గురు నేతలలో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయో ఎవరికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.

Huge Bettings On Sharmila Lokesh Raghuramakrishna Raju Details, Ap Elections, Ap
Advertisement
Huge Bettings On Sharmila Lokesh Raghuramakrishna Raju Details, Ap Elections, Ap

ఈ ముగ్గురు నేతలలో ఇద్దరు నేతలు గెలుపు కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో మాత్రమే తెలంగాణ, కర్ణాటకలో వీళ్ల గెలుపుపై భారీగా బెట్టింగ్స్( Bettings ) జరుగుతున్నాయి.డిపాజిట్ల విషయంలో, మెజారిటీ విషయంలో కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయని భోగట్టా.

ఈ ముగ్గురు నేతలు సైతం రిజల్ట్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారు.

Huge Bettings On Sharmila Lokesh Raghuramakrishna Raju Details, Ap Elections, Ap

లోకేశ్, షర్మిలలకు ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు.రఘురామ కృష్ణంరాజు గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత జగన్ పైనే విమర్శలు చేశారు.లోకేశ్ గత కొన్నేళ్లుగా మంగళగిరిలో( Mangalagiri ) గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారు.

ఆయన కష్టానికి తగ్గ ఫలితం వస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఈ అభ్యర్థుల విషయంలో వందల కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు