Venu Gopalaswamy Puttaparthi : పుట్టపర్తి వేణు గోపాలస్వామి రథోత్సవం ఎలా జరిగిందంటే..

ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తీక మాసం పండుగను ఎంతో ఘనంగా సంతోషంతో తమ కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటున్నారు.

కార్తీక మాసం కారణంగా చాలా దేవాలయాలలో భక్తులు రద్దీగా ఉన్నారు.

కొన్ని ప్రత్యేకమైన ఆలయాలలో దేవుళ్ళ రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ రథోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరై భక్తితో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు.

పుట్టపర్తి నగరంలోని వేణుగోపాల స్వామి రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.సత్య సాయి వేడుకలు ప్రతి సంవత్సరం రథోత్సవంతోనే మొదలవుతాయి.

శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు వేణుగోపాలస్వామి దేవాలయం నుంచి ప్రశాంతి నిలయం గోపురం రోడ్డు ప్రధాన ద్వారం వరకు రథోత్సవం కొనసాగింది.ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ హాలు నుంచి వేణుగోపాల స్వామి విగ్రహాన్ని రథంలో వేద పండితులు మంత్రాలను పటిస్తూ అధిష్టించారు.

Advertisement
How Was The Chariotsavam Of Venu Gopalaswamy Of Puttaparthi , Venu Gopalaswamy

సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ ఆర్ జె.రత్నాకర్ తో పాటు ట్రస్టు సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి, పుడా చైర్ పర్సన్ లక్ష్మీనరసమ్మ, అదనపు ఎస్పీ.

రామకృష్ణ ప్రసాద్ ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.అంతకుముందు సాయి కుల్వంత్ హాలులో సామూహిక సాయి సత్యనారాయణ వ్రతాలు చేశారు.

How Was The Chariotsavam Of Venu Gopalaswamy Of Puttaparthi , Venu Gopalaswamy

రథం ముందు వివిధ దేవతామూర్తుల వేషధారణలో సాయి విద్యార్థులు ప్రదర్శనలు చేస్తూ అక్కడ ఉన్న భక్తులను అలరించారు.గురువయ్యలు, ప్రదర్శనలు, చెక్కభజన, కోలాటం, డబ్బు వాయిద్యాలు తదితర ప్రదర్శనలతో భక్తులందరినీ అలరించారు.ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి యశ్వంత్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోటా సత్యం, మాజీ చైర్మన్ పిసి గంగన్న, బెస్త చలపతి డాక్టర్ గోపాల్ రెడ్డి సామకోటి ఆదినారాయణ, మాధవరెడ్డి, గంగాద్రి ఇంకా చాలామంది ఈ శుభకార్యంలో పాల్గొన్నారు.

మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత చిట్కాలు..!
Advertisement

తాజా వార్తలు