ఉదయ్ కిరణ్ ని చిత్రం సినిమా నుండి తప్పించాలనుకున్న ఎందుకు కుదరలేదు ?

ఉదయ్ కిరణ్.ఈ పేరు చెప్తే చాల మంది తెలుగు వారికి ఒక ఎమోషన్ వచ్చేస్తుంది.

ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి కనుక రాకుండా ఉండి ఉంటె ఎక్కడో ఒక చోట జాబ్ చేసుకొని హ్యాపీ గా బ్రతికి ఉండేవాడు.ఈ సినిమా ఛత్రం లో ఇరుక్కొని అందులో నుంచి బయటకు రాలేక అక్కడ నెగ్గి లేక తనను తాను బలి తీసుకున్నాడు.

ఉదయ్ కి నటుడు అవ్వాలనే కోరిక ఉండటం తో పలు మోడలింగ్ ఏజెన్సీ లతో తన ఫోటోలు ఇచ్చేవాడు.అలా అహ్మద్ అనే ఒక మాడల్ కోఆర్డినేటర్ ఉదయ్ కిరణ్ ఫోటోలను దర్శకులకు చూపిస్తూ ఉండేవాడు .అయితే ఉదయ్ కిరణ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది మాత్రం దర్శకుడు తేజ.

How Uday Kiran First Movie Chitram Selections Happened Details, Ramoji Rao, Teja

అలా అని ఉదయ్ లాంటి వ్యక్తి కోసం తేజ వల వేసి పట్టుకోలేదు.పైగా చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్ర కోసం చాల మందిని ట్రై చేసాక చివరికి ఎలాంటి అప్షన్ లేకపోవడం తో ఉదయ్ కిరణ్ ని ఫైనల్ చేసారు.చిత్రం సినిమా కోసం పూజ ముహూర్తం జరగడానికి ముందు రోజు రాత్రి వరకు హీరో ను మార్చేయాలని చిత్ర యూనిట్ బావిచింది.

Advertisement
How Uday Kiran First Movie Chitram Selections Happened Details, Ramoji Rao, Teja

చిత్రం సినిమా తీయాలని తేజ అనుకున్నప్పుడు నిర్మాత రామోజీ రావు గారు ఇచ్చిన బడ్జెట్ కేవలం నలభై లక్షలు.అందుకే ఆ సినిమాలో నటించే హీరో కోసం కేవలం 11 వేలు మాత్రమే రెమ్యునరేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.

అప్పుడు ఒక కొత్త హీరో కోసం వెతకడం ప్రారంభించగా అప్పుడు ఉదయ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు .కానీ రామోజీ రావు కి ఉదయ్ కిరణ్ నచ్చలేదు.

How Uday Kiran First Movie Chitram Selections Happened Details, Ramoji Rao, Teja

అందుకోసం అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక వ్యక్తి హీరో గా పెట్టుకోవాలంటే 11 వేలు ఇస్తే చేయను అని వెళ్ళిపోయాడు.ఆ తర్వాత మరొక వ్యక్తిని కూడా తెచ్చిన పలు కారణాల వల్ల ఒకే కాలేదు.ఇక హీరోయిన్ విషయంలోనూ మొదట వేరే హీరోయిన్ అనుకున్నారు.

రీమా సేన్ ఉదయ్ కి అక్కలాగా ఉంటుంది అని టీమ్ అంత చెప్పిన కూడా వినకుండా తేజ ఆమెనే ఫిక్స్ అయ్యాడు.దాంతో ఉదయ్ కిరణ్ మరియు రీమా సేన్ ని ఫైనల్ చేసారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

శ్రీనగర్ కాలనీ లో షూటింగ్ మొదలయి అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయబడి పెద్ద సక్సెస్ కావడం తో ఉదయ్ మరియు రీమాసేన్ ఇద్దరు బిజీ ఆర్టిస్టులు అయ్యారు.

Advertisement

తాజా వార్తలు