బొప్పాయిని తీసిపారేయకండి.. ఇలా వాడితే మీ చర్మం తల‌త‌లా మెరిసిపోతుంది!

బొప్పాయి పండు.( Papaya ) రుచిలోనే కాదు దీనిలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.

బొప్పాయి పండు డైట్ లో ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.ఆరోగ్యపరంగా బొప్పాయి అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా బొప్పాయి ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా బొప్పాయి పండును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ చర్మం తలతలా మెరిసిపోతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం చర్మానికి బొప్పాయిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు బాదం పప్పులు( Almonds ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బాగా పండిన బొప్పాయిని తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు బొప్పాయి పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పును వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ నీరు తొలగించిన పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే మీ చర్మం లో అనేక మార్పులను గమనిస్తారు.ఈ రెమెడీ మీ చర్మాన్ని సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

చర్మంపై మొటిమలు, మొండి మచ్చలను మాయం చేస్తుంది.అంతేకాదు తరచూ ఈ రెమెడీని పాటిస్తే పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.

Advertisement

చర్మం స్మూత్ గా షైనీ గా మెరుస్తుంది.డ్రై స్కిన్ వేధించకుండా ఉంటుంది.

బొప్పాయి పండులో ఉండే పలు పోషకాలు చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా, హెల్తీగా ఉంచుతాయి.స్కిన్ డ్యామేజ్ కు అడ్డుకట్ట వేస్తాయి.

అందమైన ఆరోగ్యమైన మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు