పుదీనాతో తెల్ల‌టి మెరిసే దంతాలు మీ సొంతం!

తెల్లటి మెరిసే దంతాలు మన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే కొందరి దంతాలు తెల్లగా కాకుండా పసుపు రంగులో ఉంటాయి.

కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం, తరచూ చాక్లెట్స్ తినడం, ధూమపానం, మద్యపానం, బ్రష్ సరిగ్గా చేయకపోవడం, పలు ఆరోగ్య సమస్యలు దంతాలు పసుపు రంగులో( Teeth ) మారడానికి కారణం అవుతుంటాయి.ఈ క్రమంలోనే దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే అలాంటి వారికి పుదీనా( Mint ) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.పుదీనాను ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉపయోగిస్తే అలా వేగంగా తెల్లటి మెరిసేటి దంతాలను మీ సొంతం చేసుకోవచ్చు.

పుదీనా దంతాలను సహజంగా తెల్లగా మార్చడంలో స‌హాయ‌ప‌డుతుంది.కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకుల‌ను మెత్త‌గా నూరి అందులో వ‌న్ టీ స్పూన్ కొబ్బ‌రి నూనె( Coconut oil ) వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్ స‌హాయంతో దంతాల‌కు రెండు మూడు నిమిషాల పాటు రుద్ది వాట‌ర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement

రెగ్యుల‌ర్ గా ఇలా చేశారంటే కొద్ది రోజుల్లో ఈ దంతాలు తెల్ల‌గా, కాంతివంతంగా మార‌తాయి.

అలాగే కొన్ని పుదీనా అకుల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి అందులో వ‌న్ టీ స్పూన్ లెమ‌న్ జ్యూస్( Lemon juice ) వేసి క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని దంతాల‌కు ప‌ట్టించి రెండు పాటు రుద్దుకోవాలి.ఆపై వాట‌ర్ తో దంతాల‌ను నోటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఇలా చేసిన కూడా మెరుగైన ఫ‌లితాలు పొందుతారు.పుదీనా దంతాల‌పై ప‌సుపు మ‌ర‌క‌ల‌ను క్ర‌మంగా తొల‌గిస్తుంది.

పుదీనాలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.నోటిలోని బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తాయి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఇక నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంద‌ని బాధ‌ప‌డుతున్నవారు పుదీనా ఆకులు వేసి మ‌రిగించిన నీటిని మౌత్ వాష్ గా వాడితే బ్యాడ్ బ్రీత్ స‌మ‌స్య కంట్రోల్ అవుతుంది.పుదీని ఫ్రెష్‌నెస్ ను అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు