పగిలిన పెదవులకే కాకుండా లిప్ బామ్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో...?

పెదవులు పగిలినప్పుడు లిప్ బామ్ రాస్తూ ఉంటాం.మనం ఎక్కడకు వెళ్లిన మన బ్యాగ్ లో లిప్ బామ్ తప్పనిసరిగా ఉంటుంది.

లిప్ బామ్ అనేది పగిలిన పెదవులకే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.చేతులు పొడిగా మారినప్పుడు రాసుకోవటానికి లోషన్ అందుబాటులో లేకపోతే లిప్ బామ్ రాసుకోవచ్చు.

లిప్ బామ్ రాయటం వలన చేతులు పొడిగా లేకుండా తేమగా ఉంటాయి.

Advertisement

పొడిగా మారిన గోళ్లపై రాస్తే గోళ్లకు తేమ,పోషణ అందుతాయి.దాంతో గోళ్లు కాంతివంతంగా,ఆరోగ్యంగా ఉంటాయి.కంటి మేకప్ ని తొలగించే రిమూవర్ అందుబాటులో లేనప్పుడు లిప్ బామ్ ని ఉపయోగించి కంటి మేకప్ తొలగించవచ్చు.

మింట్ వాసన వచ్చే లిప్ బామ్ ని వాడితే బాగుంటుంది.మార్కెట్ లో చాలా రకాల లిప్ బామ్స్ అందుబాటులో ఉన్నాయి.కంటి కింద గీతలు,ఉబ్బు తగ్గటానికి లిప్ బామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

మామూలు మాయిశ్చరైజర్ ల కన్నా కంటి కింద లిప్ బామ్ లే ఎక్కువ తేమను అందిస్తాయి.జుట్టు చిక్కు పడినప్పుడు ఎటువంటి హెయిర్ స్ప్రై వాడకుండా లిప్ బామ్ రాస్తే ఆ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.

జలుబు చేసినప్పుడు తరచుగా ముక్కును తుడుస్తూ ఉంటాం.ఆలా చేసినప్పుడు ముక్కు ఎర్రగా, పొడిగా మారుతుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
ఈ మూడు ఉంటే చాలు.. రాలిపోయిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది!

ఆ సమయంలో ముక్కు మీద లిప్ బామ్ రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు