మచ్చలను మాయం చేసే మీగడ.‌. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?

సాధారణంగా కొందరికి ముఖం మొత్తం మచ్చలు పడుతుంటాయి.మొటిమలు, వయసు పై బ‌డటం తదితర కారణాల వల్ల చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడతాయి.

ఇవి మన అందాన్ని దారుణంగా పాడు చేస్తాయి.ఈ క్రమంలోనే మచ్చలను వదిలించుకోవడం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

ఖరీదైన క్రీమ్.సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారుజ‌ కానీ పైసా ఖర్చు లేకుండా మీగడ ( Meegada )తో మచ్చలను మాయం చేసుకోవచ్చు.

పాలు లేదా పెరుగు మీద మీగడ తీసి ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్‌ లో పెట్టడం అందరి ఇళ్ళలో రోజూ చూస్తూనే ఉంటారు.

Advertisement

ఈ మీగడ ను ఫ్రెష్ క్రీమ్( Fresh cream ) అని పిలుస్తుంటారు.మీగడ రుచిగా ఉండడమే కాదు బోలెడు పోషకాలను కలిగి ఉంటుంది.చర్మ సౌందర్యానికి మీగడ చాలా బాగా సహాయపడుతుంది.

ఇప్పుడంటే అనేక రకాల మాయిశ్చరైజర్స్ వచ్చాయి.కానీ ఒకప్పుడు చర్మానికి మీగడనే సహజ మాయిశ్చరైజర్ గా వాడేవారు.

అలాగే మీగడ తో మచ్చలను కూడా వదిలించుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మీగడ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పుదీనా జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్,( Mulethi Powder ) నాలుగు చుక్కలు నిమ్మరసం( Lemon juice ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే మీ ముఖ చర్మం పై ఎలాంటి మొండి మచ్చలు ఉన్న సరే క్రమంగా మాయం అవుతాయి.మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.

Advertisement

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల మీ ముఖ చర్మం స్మూత్ గా షైనీ గా మారుతుంది.ముడతలు చారలు వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మరియు స్కిన్ టైట్ గా సైతం మారుతుంది.

తాజా వార్తలు