టాయిలెట్ ఇలా వాడండి... ఫ్లష్‌లో చిన్న, పెద్ద బటన్‌లను ఇలా ఉపయోగించండి!

నేడు పల్లె, పట్టణం అని తేడా లేకుండా అందరి ఇళ్లల్లో వాష్‌రూమ్ అనేది పరిపాటిగా మారింది.

కాలానుక్రమాన్ని బట్టి ఈ మధ్య కాలంలో ఇంటి నుంచి మొందలు షాపింగ్ మాల్స్ వరకు.

ప్రతిచోటా వాష్‌రూమ్‌లలో హై టెక్నాలజీ ఆధునిక ఫిట్టింగ్‌లు వచ్చేశాయి.ఈ క్రమంలో వాష్‌రూమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన అనేక రకాల ఫ్లష్‌లను మీరు చూసే వుంటారు.

వాష్‌రూమ్ ఫ్లష్‌లో ఒక పెద్దది, మరొకటి చిన్న బటన్లను మీరు గమనించి ఉంటారు.అయితే ఇలా రెండింటిని ఒకే చోట ఎందుకు ఏర్పాటు చేసారని ఎపుడైనా ఆలోచించారా? మనలో చాలామందికి ఈ రెండింటిని దేనిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలియదు.వాస్తవానికి, వెస్ట్రన్ టాయిలెట్లలో రెండు రకాల బటన్లు ఉంటాయి.

వాటిలో ఒక బటన్ బయటకు వెళ్తున్న వాల్వ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.పెద్ద బటన్‌ను నొక్కితే దాదాపు 6 లీటర్ల నీరు, చిన్న బటన్‌ను నొక్కితే 3 నుంచి 4.5 లీటర్ల నీరు బయటకు వస్తుంది.ఇంట్లో సింగిల్ ఫ్లష్‌కు బదులుగా డ్యూయల్ ఫ్లషింగ్ కాన్సెప్ట్‌ను మీ ఇంట్లో ఉండి ఉంటే మొత్తం ఏడాదికి 20 వేల లీటర్ల వరకు నీటిని ఆదా చేయవచ్చు.

Advertisement
How To Use Dual Flush Button In Toilet,Toilet, Flush, Button,Flush Buttons,Vira

అయితే దీని ఇన్‌స్టాలేషన్ సాధారణ ఫ్లష్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.

How To Use Dual Flush Button In Toilet,toilet, Flush, Button,flush Buttons,vira

ఇది పర్యావరణ అనుకూలమైనది మరియు నీటి బిల్లులను తగ్గించడంలో సహాయపడుతుంది.టాయిలెట్‌లో డ్యూయల్ ఫ్లష్‌ను ఇన్‌స్టాల్ చేయాలనే ఆలోచన వాస్తవానికి అమెరికా పారిశ్రామిక డిజైనర్ విక్టర్ పెపనెక్ నుంచి వచ్చింది.1976లో ఆయన రాసిన ‘డిజైన్ ఫర్ ది రియల్ వరల్డ్’ పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు.అయితే, ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్లష్ 1980లో ఆస్ట్రేలియాలో తయారు చేయబడింది.

దీని తర్వాత ఇతర దేశాలలో దీని ట్రెండ్ మొదలైంది.కాబట్టి, మీరు ఇక ముందు టాయిలెట్‌ని ఉపయోగించినప్పుడు.

మీ అవసరాన్ని బట్టి ఫ్లష్ చేయండి.

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ తాగితే ప్రమాదమా...
Advertisement

తాజా వార్తలు