పెరుగు నల్లని మచ్చలను తొలగిస్తుందని మీకు తెలుసా?

పెరుగు అనేది దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరియు బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

వీటి గురించి తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ట్యాన్, నల్లని మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

అంతేకాకుండా పెరుగు బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.ఇప్పుడు పెరుగుతో ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

ఒక స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖం,మెడ మీద పట్టించి అరగంట అయ్యాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు ఒక నెల పాటు చేస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది.

Advertisement

ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడిని తీసుకుని పెరుగు కలిపి మెత్తని పేస్టుగా చేయాలి.దీనిని ముఖానికి, మెడకు బాగా పట్టించి అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయండి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు తొలగిపోతాయి.ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుకు రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలపండి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిముషాలు మర్దన చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటె ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

ఒక చిన్న అరటి పండు ముక్కను తీసుకుని గుజ్జుగా చేయండి.దీనికి ఒక స్పూన్ పెరుగును వేసి బాగా కలపాలి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
ఈ పుణ్యక్షేత్రంలో పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తే స్వర్గం ప్రాప్తించడం ఖాయం..!

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఉంచండి.ఆ తరువాత నీటితో కడిగేయండి.

Advertisement

ఈ ప్యాక్ ముఖం మీద ట్యాన్ ని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

తాజా వార్తలు