ఇటీవల ఒక మిత్రులు cfms ID అంటే ఏమిటి? PPO ID అంటే ఏమిటి? ఈ రెండూ ఒకటేనా? అని మన గ్రూప్లో అడగడం జరిగింది.
దానిపై Treasury ID , CFMS ID, PPO Number, PPO ID, PAN Number లపై ఓ చిన్న వివరణ
Treasury ID అంటే ఏమిటి?
ట్రెజరీ డిపార్టుమెంట్ వారు ట్రెజరీ పరిధిలో జీతాలు పెన్షన్లు చెల్లించే వారందరికి ఆర్ధికపరమైన అన్నిలావాదేవీలు జీతాలు చెల్లింపుకొరకు 7అంకెల తో వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరికి ఒక కోడ్ ను కేటాయించడం జరిగింది.Human Resource Management System HRMS గా దీనిని అభివృద్ది చేసారు.
HRMS తదనంతరం మరింత మెరుగు పరుస్తూ CFMS Comperhensive FinanciaL Management System ను ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ తరపున APCFSS Andhra Pradesh Center for Financial System and Services వారు అమలు లోకి తీసుకు వచ్చి నిర్వహిస్తున్నారు.ఈ సిస్టమ్ లో గతంలో ఇవ్వబడ్డ 7 అంకెల ట్రెజరీ ఐడి (HRMS code) ఆధారంగా 8 అంకెల CFMS నెంబరు ప్రతీ ఉద్యోగి/ పెన్షనర్ కు కేటాయించుట జరిగింది.
ఈ CFMS Number పైనే ఉద్యోగి/ పెన్షనర్ కు సంబందించిన ఆర్ధిక లావాదేవీలన్ని నిర్వహించ బడతాయి.ఇది పర్మనెంట్ ఐడి.సర్వీసులో ఉన్నప్పుడే కాక రిటైర్ అయిన తరువాత కూడా పెన్షన్ తత్సంబధిత అన్ని ఆర్ధిక లావాదేవీలకు , ఎంప్లాయిస్ హెల్త్ కార్డులకు పెన్షనర్ హెల్త్ కార్డులకు సంబంధించిన అన్ని లావాదేవీలు ఈ cfms ID ద్వారానే నిర్వహించబడతాయి.ప్రతీనెల పెన్షనర్లు ఈ cfms ID తో పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని తమ తమ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోగలుగుతాం.CFMS విధానం రాకముందు రిటైర్ అయినవారందరికి కూడా వారి ట్రెజరీ లలో ఈ నెంబర్ అలాట్ చేయబడింది.
ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సందర్భంలో తమ పెన్షన్ , గ్రాట్యుటీ , కమ్యుటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తుచేసినపుడు వాటిని మంజూరుచేస్తూ AG office లేదా State Audit Office వారు ఇవ్వబడే ఉత్వర్వులే పిపిఓ .అంటే Pension Payment Order.AP ప్రభుత్వ ఉద్యోగులకు సాధారంగా 8 అంకెలతో ఈ ఆర్డర్ ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు EPF పెన్షన్ దార్లకు 12 అంకెలతో పిపివో ఉంటుంది.PPO మంజూరుచేసిన వెంటనే AG office లేదా State Audit Office వారు 3 కాపీలను తయారు చేసి ఒకటి Pensiner Copy గా సంంబంధిత పెన్షనర్కు , ఒక కాపీ SR తో కలిపి Office Copy గా కార్యాలయాధిపతికి , మూడవ కాపీ పెన్షన్ ప్రపోజల్స్ లో ఒక కాపీకి జతచేసి DTO office కు పంపుతారు .District Treasury Office వారు సంబంధిత రికార్డులలో కంప్యూటరీకరించి ఆ కాపీని సంబంధిత STO కు పంపడం జరుగుతుంది.ఇందులో Pensioners Copy ని మనం చాలా జాగ్రత్తగా బధ్రపరుచుకోవాలి.రిటైర్ అయిన మనకు ఇదే మనకు సర్వీసులో ఉన్నప్పుడు SR లాంటిదని గుర్తుంచుకోవాలి.
PPO - PPO ID ఈ రెండు ఒకటి కాదు.PPO గురించి పైన చెపపుకున్నాం.
PPO అంటే Pension Payment Order issued by AG.PPO ID- రిటైర్ అయి PPO ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీవారు 8 అంకెలతో క్రియేట్ చేసి అలాట్ చేసే ఒక ఐడి.అందులో మొదటి మూడంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవై ఉంటాయి.తదుపరి ఐదు అంకెలు ట్రెజరీవారు కేటాయిస్తారు.2019 కు ముందు పదవీ విరమణ చేసిన వారందరికి ఇలా PPO ID ని కేటాయించే వారు.Pensioner Health cards వారికి ఈ PPO ID నే User ID గా ఉపయోగించవలసి వచ్చేది.2020 దాటిని తరువాత పదవీ విరమణ చేసినవారికీ ఈ PPO ID అనేది కేటాయించబడదు.వారి కి CFMS నెంబరే అన్నింటికి వాడుకలో ఉంటుంది.
PAN అంటే Permanent Account Number.పాన్ కార్డు ఆదాయపు పన్ను శాఖ చే జారీ చేయబడుతుంది.పాన్ కార్డుపై 10 డిజిట్స్ ఉంటాయి.
వ్యక్తిగతంగా తీసుకున్నా , ఏదైనా సంస్థ తరఫున తీసుకున్నా పాన్ నెంబర్‌లో 10 డిజిట్స్ ఉంటాయి.పాన్ కార్డ్ నెంబరులో ఆంగ్లభాషలో కేపిటల్ అక్షరాలు ఆరు , ఆంగ్ల సంఖ్యామానపు అంకెలు 4 మొత్తం పది డిజిట్స్ తో కూడి ఉంటుంది.
ఇది మనకు కేటాయించబడే శాశ్విత ఖాతా సంఖ్య గామనం గుర్తుంచుకోవాలి.ఒక సారి మనకు కేటాయించబడిన పాన్ సంఖ్య మార్చుకోనే వీలుండదు.
ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి పాన్ తప్పనిసరి చేయబడింది.బ్యాంక్ ఖాతాలను తెరవడం, బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయడం, డీమాట్ ఖాతా తెరవడం, స్థిరమైన ఆస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో వ్యవహరించడం వంటి అనేక ఇతర ఆర్థిక లావాదేవీలకు కూడా పాన్ తప్పనిసరి.
పాన్ నెంబర్‌లోని 10 అంకెల్లో ఒక్కో డిజిట్‌కు ఒక్కో అర్థం,ఒక ప్రత్యేకత ఉంటుంది.అవి ఏమిటో చూద్దాం! పాన్ నెంబర్‌లోని మొదటి ఆరు డిజిట్స్ A నుంచి Z వరకున్న ఇంగ్లీషు కేపిటల్ లెటర్సు ఉంటాయి.
అది కూడా ఆల్ఫాబెటిక్ సిరీస్‌గా ఉంటాయి.నాలుగవ లెట పాన్ హోల్డర్ స్టేటస్‌ను తెలియజేస్తుంది.
వ్యక్తులకు జారీచేసే కార్డులో నాలుగవ డిజిట్ " P " అని ఉంటుంది.P అంటే పర్సన్ అని అర్ధం.
ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు వ్యక్తులకు, సంస్థలకు జారీ చేస్తుంది.పాన్ హోల్డర్ స్టేటస్‌ను బట్టి పాన్ నెంబర్‌లో కేటాయింబడే నాలుగో అంకె ఏం సూచిస్తుందో చూద్దాం!! A- అసోసియేట్ ఆఫ్ పర్సన్స్ B – బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ C – కంపెనీ (సంస్థ) F- ఫర్మ్ (లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్) G – గవర్నమెంట్ ఏజన్సీ (ప్రభుత్వ సంస్థ) H – హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) J- ఆర్టిఫిషియల్ జ్యురిడికల్ పర్సన్ L – లోకల్ అథారిటీ P – పర్సన్ (వ్యక్తి) T – ట్రస్ట్ వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునేవారందరికీ నాలుగో లెటర్ ‘P’ అనే ఉంటుంది.
పాన్ నెంబర్‌లో ఐదో లెటర్ దరఖాస్తు చేసిన వ్యక్తి ఇంటి పేరులో మొదటి అక్షరంగా ఉంటుంది.పాన్ నెంబర్‌లో 6 నుంచి 9వ డిజిట్ వకు 1 నుంచి 9 నెంబర్ మధ్య అంకెలుతో 4అంకెల సంఖ్య ఉంటుంది.
పాన్ నెంబర్‌లోని 10వ డిజిట్‌ను ఆల్ఫబెటిక్ చెక్ డిజిట్ అంటారు.మొదటి 9 డిజిట్స్‌కు ఫార్మూలా అప్లై చేసి చివరి డిజిట్‌ను కంప్యూటర్ జెనరేట్ చేస్తుంది.
ఇలా దరఖాస్తు దారుడు పేరు, ఇంటి పేరు, వ్యక్తిగతంగా దరఖాస్తు చేస్తున్నాడా.? లేదా ఏదైనా వ్యాపార సంస్థ తరపున చేస్తున్నారా.? అనే వివరాలను బట్టి ఈ 10 డిజిట్స్‌ను క్రియేట్ చేస్తుంది ఆయదాపను పన్ను శాఖ.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy