ఇలాంటి చీపురు వాడితే దరిద్రం ఇంట్లోనే ఉంటుంది!

మీరు ఇంట్లో వాడుతున్న చీపురు విరిగినా తరువాత దాన్ని వాడుతూ ఉంటే అలా చేయడాన్ని మీరు వెంటనే తగ్గించాలి.

చాలా మంది ఇలా విరిగిన చీపురును వాడుతుంటారు.

వాస్తు ప్రకారం ఇలా చేయకూడదు.ఒకసారి విరిగిన చీపురును వాడటం, లేదా వాటిని మళ్లీ అతికించి లేదా అడ్జస్ట్ చేసి వాడటం అశుభ సూచకంగా పరిగణిస్తారు.

ఎక్కడంటే అక్కడ పెట్టకూడదుచీపురు కట్టపెట్టడానికి మంచి స్థలం చూసుకోవాలి.కొన్ని స్థలాల్లో అస్సలు చీపురు పెట్టకూడదు.

ముఖ్యంగా బంగారం, నగలు పెట్టే స్థలంలో చీపురు అస్సలు పెట్టకూడదు.దాంతో పాటు డబ్బుల పెట్ట ఉన్న స్థలంలో పెట్టకూడదు.

Advertisement
How To Use Broom For Have Good Luck , Broom, Devotinal, Good Luck, Telugu Devoti

దీని వల్ల మీ వ్యాపారం, నగదు వ్యవహరంలో నష్టం కలగవచ్చునని పండితులు చెబుతారు.చీపురును నిలబెట్టకూడదు.

మీరు ఎక్కడైనా చీపురు వాడుతూ ఉంటే.దాన్ని వాడిన తరువాత దాన్ని నిలబెట్టే బదులు నేలపై అన్చేయండి.

చీపురును ఎప్పుడూ నిలెబట్టి ఉంచరాదు.ఇలా చేయడం అశుభమట.

ఇలా చేయకుండా ఉంటే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదని అంటారు.

How To Use Broom For Have Good Luck , Broom, Devotinal, Good Luck, Telugu Devoti
ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

సాయంత్రం ఇల్లు క్లీన్ చేయకూడదుసాయంత్రం సమయంలో అస్సలు చీపురు పట్టకూడదు.అందుకే సాయంత్రం ఆరు గంటలకు దాటగానే ఇల్లు శుభ్రం చేయకూడదు అని మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం మనం వినే ఉంటాం.ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని పండితులు చెబుతారు.

Advertisement

అందుకే సాయంత్రం దాటిన సమయంలో లేదా రాత్రి సమయాల్లో ఇల్లు ఊడవరాదు.ఊడ్చినా, చెత్తను బయటపడేయరాదు.

తాజా వార్తలు