బాదం పాలు ఆరోగ్యానికే కాదు జుట్టును పెంచుతాయి.. ఎలా వాడాలంటే?

ఇటీవల కాలంలో చాలా మంది జంతువుల‌ పాలుకు ప్రత్యామ్నాయంగా బాదం పాలును ఎంచుకుంటున్నారు.ఇంట్లోనే బాదం పప్పుతో పాలు తయారు చేసుకుని వాడుతున్నారు.

అలాగే డైరీస్‌లో కూడా ఆల్మండ్ మిల్క్ అందుబాటులో ఉంటోంది.పోషకాల పరంగా బాదం పాలుకు సాటే లేదు.

ఎన్నో ర‌కాల విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ వంటివి బాదం పాల‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి.అందువ‌ల్ల‌ ఆరోగ్యానికి బాదం పాలు( Almond milk ) ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అనేక జబ్బులకు అడ్డుకట్టగా నిలుస్తాయి.

Advertisement

అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు జుట్టును పెంచడానికి కూడా బాదం పాలు సహాయపడతాయ‌ని మీకు తెలుసా.? అవును, బాదం పాలలో ఉండే మెగ్నీషియం మరియు ఇతర పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.హెయిర్ గ్రోత్ ( Hair growth )ను ఇంప్రూవ్ చేస్తాయి.

మరి ఇంతకీ జుట్టుకు బాదం పాలును ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లేదా మూడు మందార పువ్వులను తుంచి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ( Aloe vera gel )తో పాటు అరకప్పు ఫ్రెష్ హోమ్ మేడ్ బాదం పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలిగంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.కురులు ఎంత పల్చగా, పొట్టిగా ఉన్నా కూడా ఒత్తుగా మ‌రియు పొడుగ్గా పెరుగుతాయి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

అలాగే ఈ రెమెడీని పాటిస్తే కురులు సిల్కీగా మారతాయి.జుట్టు ( Hair )త‌ర‌చూ చిట్లిపోతుందని చాలా మంది బాధపడుతుంటారు.

Advertisement

అలాంటి వారు కూడా ఈ బాదం పాలు హెయిర్ మాస్క్ ను ట్రై చేయ‌వ‌చ్చు.

తాజా వార్తలు