బీరకాయ ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.. ఇంతకీ ఎలా వాడాలంటే?

బీరకాయ( Ridge gourd ).ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన కూరగాయల్లో ఒకటి.

బీరకాయతో మన భారతీయులు రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.బీరకాయ పోషకాలకు పవర్ హౌస్ లాంటిది.

అందువల్ల ఆరోగ్యానికి ఇది ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అంతేకాదండోయ్ జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలోనూ బీరకాయ తోడ్పడుతుంది.

ముఖ్యంగా బీరకాయను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పవచ్చు.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement
How To Use A Ridge Gourd For Hair Fall Control! Hair Fall, Stop Hair Fall, Ridge

వాటర్ హీట్‌ అయ్యాక ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే గింజ తొలగించి ముక్కలుగా తరిగిన ఒక ఉసిరికాయ, రెండు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకుని ఉడికించాలి.

దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్టైనర్ సహాయంతో వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

How To Use A Ridge Gourd For Hair Fall Control Hair Fall, Stop Hair Fall, Ridge

ఇప్పుడు ఈ వాటర్ ను గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.రెండు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే జుట్టు రాలడం అన్న మాటే ఉండదు.

How To Use A Ridge Gourd For Hair Fall Control Hair Fall, Stop Hair Fall, Ridge

పైన చెప్పుకున్న టోనర్ ను వాడటం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

కురులు ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతాయి.కాబట్టి హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా బీరకాయతో పైన చెప్పిన విధంగా టోనర్ ను తయారు చేసుకుని వాడెందుకు ప్రయత్నించండి.

Advertisement

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

తాజా వార్తలు