ప్రయాణంలో వాంతులా.. డోంట్ వర్రీ ఇలా చేయండి!

సాధారణంగా కొందరికి జర్నీ అనేది అస్సలు పడదు.

ముఖ్యంగా కారు, ఫ్లైట్, బస్సు వంటి వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు వాంతులు, వికారం వంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతుంటారు.

మోషన్ సిక్ నెస్(Motion sickness), వాహనంలో పేలవమైన వెంటిలేషన్, జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, ఫుడ్ పాయిజనింగ్ తదితర కారణాల వల్ల ప్రయాణంలో వాంతులు అవుతుంటాయి.అందువల్ల ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలను పాటిస్తే ఏ సమస్య లేకుండా మీ ప్రయాణాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు.

How To Stop Vomiting While Travelling Stop Vomiting Tips, Home Remedies, Latest

యాలకులు(Cardamom).జర్నీ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ప్రయాణం చేసేటప్పుడు వచ్చి యాలకులను(Cardamom) నమిలితే వాంతులు, వికారం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

Advertisement
How To Stop Vomiting While Travelling? Stop Vomiting Tips, Home Remedies, Latest

పైగా యాలకులు మంచి మౌత్ ఫ్రెషనర్ గా సైతం పనిచేస్తాయి.అలాగే వాంతులను తగ్గించడంలో నిమ్మకాయ (Lemon)ఉత్తమంగా సహాయపడుతుంది.నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ఇందుకు కారణం.

నిమ్మకాయను నేరుగా రుచి చూడడం లేదా జ్యూస్ చేసుకుని తీసుకోవడం చేస్తే ప్రయాణం సమయంలో వాంతులు దెబ్బకు కంట్రోల్ అవుతాయి.

How To Stop Vomiting While Travelling Stop Vomiting Tips, Home Remedies, Latest

సోంపు(Anise) కేవలం జీర్ణ సమస్యలను దూరం చేయడానికి మాత్రమే సహాయపడుతుంది అనుకుంటే పొరపాటే.వాంతులను ఆపడంలో కూడా హెల్ప్ చేస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు సోంపును వెంట ఉంచుకోండి.

అప్పుడప్పుడు కొంచెం సోంపును(Anise) నోట్లో వేసుకుని నమ్ముతూ ఉండండి.ఇలా చేయడం వల్ల వాంతులు వికారం వంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

జర్నీ చేసేటప్పుడు వాంతులతో పాటు తరచుగా వచ్చే వికారం మరియు కడుపు అసౌకర్యం నుంచి ఉపశమనం పొందడానికి మీరు అల్లం టీ(Ginger Tea) ను ప్రయత్నించవచ్చు.అల్లం యాంటీ నాసియా లక్షణాలను కలిగి ఉంది, అందువల్ల అల్లం ఆయా సమస్యల నుంచి మంచి రిలీఫ్ ను అందిస్తుంది.మూడ్ ను చేంజ్ చేస్తుంది.

Advertisement

ఇక ప్రయాణం సమయంలో వాంతులను ఆపడానికి లవంగాలు కూడా గ్రేట్ గా తోడ్పడతాయి.వాంతులు వచ్చేటట్టు అనుమానం కలిగితే వెంటనే ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకుని ఉంచుకోండి.

ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తాజా వార్తలు